Page Loader
Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!
ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2023
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ స్కూటర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఓలా తన ఎస్ 1 మోడల్, ఎస్ 1 ఎయిర్ పేరుతో తక్కువ ధరకే స్కూటర్ ను లాంచ్ చేసింది. ఇండియాలో అతి చౌకైనా ఈవీగా ఈ ఎస్1 ఎయిర్ నిలుస్తోంది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎస్​1, ఎస్​1 ప్రో ఉన్నట్లు కాకుండా, ఈ మోడల్​లో బెల్ట్​ డ్రైవ్​ స్థానంలో హబ్​ మోటార్​ ఉండనుంది.

Details

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్లు

ఓలా ఎస్​1 ఎయిర్ లో ఈకో, నార్మల్, స్పోర్ట్స్ వంటి రైడ్ మోడ్స్ కూడా ఇందులో ఉండన్నాయి. దీని టాప్ స్పీడ్ 90కేఎంపీహెచ్ కాగా, ఈ వెహికల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 125 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. ఇక ఈ స్కూటర్​లో జీపీఎస్​ నేవిగేషన్​, సైడ్​ స్టాండ్​ అలర్ట్​, రివర్స్​ మోడ్​,, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ, ఓటీఏ అప్డేట్స్​, రిమోట్​ బూట్​ అన్​లాక్, 7 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​ వంటి ఆప్షన్స్​ కూడా వస్తున్నాయి. ఈ వెహికల్ కోరమ్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, నియో మింట్, పోర్సెలిన్ వైట్ కలర్లలో అందుబాటులో ఉంది. ఆఫర్ కింద ఈ స్కూటర్‌ను రూ.1.09 లక్షలకే పొందవచ్చు.