Page Loader
కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?
కేటీఎం నుంచి త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్

కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీ మిలాన్‌లో ఈ ఏడాది జరగనున్న ఈఐసీఎంఏ షో ఆ బైక్ ను ఆ సంస్థ ప్రదర్శించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ కు సంబంధించిన వివరాలపై మనం ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం ఈవీలను రూపొందించేందుకు అనేక ఆటోమొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కేటీఎం కూడా చేరింది. ఇండియాలో దీనిని బజాజ్ ఆటో రూపొందించడానికి ప్లాన్ చేస్తోందట. ఇండియాలో తయారు చేసి అంతర్జాతీయ విపణిలోకి ఎగుమతి చేసే యోచనలో ఆ సంస్థ ఉందట.

Details

లాంచ్ సమయంలో ధరపై క్లారిటీ

ప్రస్తుతం కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన టెస్ట్ మ్యూల్ ఒకటి రోడ్డు మీద దర్శనమిచ్చింది. దీంతో ఈ టూవీలర్ డిజైన్ తో పాటు ఇతర వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో ఫ్లాట్​ సీట్​, ఫ్లైస్క్రీన్​తో పాటు వీల్స్​ స్పోర్టీగా ఉండనున్నాయి. ఫ్రెంట్​ ఏప్రన్​ చాలా అగ్రెసివ్​గా ఉండే అవకాశం ఉంది. ఫుట్​బోర్డ్​ ఫ్లాట్​గా, సిల్వర్డ్​ పిలియన్​ గ్రాబ్​ టెయిల్​తో కూడిన సింగిల్​ సీట్​ ఉండొచ్చు. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, అల్యుమీనియం స్వింగ్​ అర్మాతో పాటు అలాయ్​ వీల్స్​ రానున్నాయి. ధరకు సంబంధించిన విషయాలను లాంచ్ సమయంలో సంస్థ వెల్లడించే అవకాశం ఉంది. ఈ-స్కూటర్​ కోసం కేటీఎం లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.