Page Loader
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులో 650 సీసీ.. ఫీచర్లు మాత్రం అదరహో 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులో 650 సీసీ.. ఫీచర్లు మాత్రం అదరహో 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త హిమాలయన్ 450ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 650సీసీ కెపాసిటీ గల ఇంజన్‌తో దీన్ని విడుదల చేయడానికి ప్రస్తుతం ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 650 టెస్టింగ్ దశలో కనిపించింది. దీని సీటింగ్ లేఅవుట్ స్ప్లిట్-టైప్ డిజైన్‌ను కలిగి ఉంది, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ముందు సీటును కూడా పెంచారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 వలే కాకుండా , రాబోయే హిమాలయన్ 650 సెమీ-ఫెయిరింగ్‌ అందుబాటులో ఉంది. ఇది ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ కంటే ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది.

Details

బైక్ ధర రూ. 4లక్షలు

దీని డిజైన్ బెనెల్లీ TNT 600 GTని పోలి ఉంటుంది. ఇది సుదూర ప్రయాణానికి 20-లీటర్ల కంటే ఎక్కువ కెపాసిటీ గల ఇంధన ట్యాంక్‌ను అమర్చారు. ఇందులో డిజిటల్ TFT స్క్రీన్‌గా కనిపిస్తుంది. ఈ బైక్ 50bhp శక్తిని, 60Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ కోసం, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ద్విచక్ర వాహనంలో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన వైర్-స్పోక్ వీల్స్ ఉంటాయి. దీని ధర దాదాపు రూ. 4 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.