హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ పోటీగా వోక్స్‌వ్యాగన్ టైగన్ వచ్చేసింది
ఇండియాలో సురక్షిత ఎస్‌యూవీగా టైగన్ జీటీ ఫోక్సో వేగన్ ఫ్లాగ్ షిప్ పేరుగాంచింది. నవంబర్ 2న 2024 మోడల్ టైగన్ ఎడ్జ్ ట్రయల్ ఎడిషన్‌ను ఫోక్స్ వేగన్ లాంచ్ చేసింది. ఇది హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్‌కు పోటీగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ కెట్రాకి ఇండియాలో మంచి పేరు ఉంది. గతేడాది ప్రత్యేక నైట్ ఎడిషన్ మోడల్ తర్వాత, ఈ ఆగస్టులో అడ్వెంచర్ ఎడిషన్ వేరియంట్‌ను పరిచయం చేసింది. వోక్సోవ్యాగన్ టైగన్ జీటీ కంటే హ్యుందాయ్ కెట్రాను ఆకర్షణీయంగా రూపొందించారు. కెట్రాలో బ్లాక్-అవుట్ స్కిడ్ ప్లేట్లు, పారామెట్రిక్ గ్రిల్, డోర్ సిల్స్, రూఫ్ రెయిల్స్, ORVMలు, షార్క్-ఫిన్ యాంటెన్నా, 17-అంగుళాల డిజైనర్ వీల్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ కెట్రాలో అధునాతన ఫీచర్లు
వోక్స్‌వ్యాగన్ టైగన్ GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్‌లో ఫంక్షనల్ రూఫ్ రెయిల్‌లు, బ్లాక్ డోర్ గార్నిష్, రెడ్-యాక్సెంటెడ్ ORVMలు పుడ్ల్ ల్యాంప్స్, బ్లాక్ కలర్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. CRETA క్యాబిన్ పూర్తిగా బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్-వ్యూ డాష్‌క్యామ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.24-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ఇండియాలో హ్యుందాయ్ CRETA అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ. 15.17 లక్షల నుంచి రూ. 17.89 లక్షల మధ్య ఉండనుంది. వోక్స్‌వ్యాగన్ టైగన్ జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్ ధర రూ. 16.29 లక్షలు ఉంది.