Page Loader
Toyota cars waiting period : ఈ కార్లకు భలే డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 2025 వరకు ఆగాల్సిందే!
ఈ కార్లకు భలే డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 2025 వరకు ఆగాల్సిందే!

Toyota cars waiting period : ఈ కార్లకు భలే డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 2025 వరకు ఆగాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2023
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే, కారు ఇంటికి రావడానికి ఏకంగా 2025 వరకు ఆగాల్సిందే. అంటే ఆ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టయోటా పోర్ట్ ఫోలియోలోని అనేక మోడల్స్‌కు భారీ వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. ఇక కొత్తగా లాంచ్ అయినా టయోటా రుమియన్ పరిస్థితి కూడా ఇంతే. ఈ క్రమంలో టయోటో మోడల్స్, వాటి వెయిటింగ్ పీరియడ్ వివరాలపై ఓ లుక్కేద్దాం. టయోటా రుమియన్ ఎంపీవీలో స్టాండర్ట్ వేరియంట్ కన్నా, సీఎన్‌జీ వేరియంట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ వెహికిల్‌ని రూపొందించిన విషయం తెలిసిందే.

Details

 టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‌జీకి అధిక వెయిటింగ్ పీరియడ్ 

ఇక రుమియన్ సీఎన్‌జీ మోడల్‌కు 18 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్ షో రూం ధర రూ.10.29 లక్షలు. డిమాండ్ కారణంగా, ప్రస్తుతం సీఎన్‌జీ వేరియంట్ బుకింగ్స్‌ని ఆ సంస్థ నిలిపివేసింది. రుమియన్ సీఎన్‌జీ తర్వాత టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్‌జీకి అధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీనికి 16 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.13.23 లక్షలు. గతేడాది డిసెంబర్ లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు 15 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇది 181 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇక టయోటా వైల్‌ఫైర్ ఇప్పుడు బుక్ చేస్తే 15 నెలలు పాటు ఆగాల్సిందే