
Budget cars : రూ. 5లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు ఇవే.. మైలేజ్, సేఫ్టీ రెండింటిలోనూ టాప్
ఈ వార్తాకథనం ఏంటి
సొంత ఇల్లు, సొంత కారు - ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం కలగంటే ఇవే. ఈ కలలను నెరవేర్చుకోవడం కోసం సంవత్సరాల తరబడి పొదుపు చేస్తుంటారు.
ఇటీవలి కాలంలో అందుబాటు ధరలో మంచి మైలేజ్ కలిగిన వాహనాలపై డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆటోమొబైల్ సంస్థలు ఈ బడ్జెట్ సెగ్మెంట్‌పై దృష్టిపెడుతున్నాయి.
రూ. 5 లక్షల లోపు ఉండే బెస్ట్ కార్లను ఇక్కడ చూద్దాం. ఇవి 'ధర తక్కువే కానీ పనితీరు ప్రీమియంగా ఉంటుంది' అన్న రీతిలో మార్కెట్‌లో మంచి సేల్స్‌ను దక్కించుకున్నాయి.
Details
1. టాటా టియాగో (Tata Tiago)
టాటా మోటార్స్ నుంచి వచ్చిన అత్యంత విజయవంతమైన మోడల్స్‌లో టియాగో ఒకటి. దాదాపు 10 ఏళ్లుగా ఇది మార్కెట్‌లో నిలకడగా విక్రయాలు సాధిస్తోంది.
ప్రారంభ ధర: రూ.4.99 లక్షలు
టాప్ ఎండ్ ధర: రూ.8.45 లక్షలు
ఇంజిన్: 1199cc
ఫ్యూయల్ టైప్: పెట్రోల్, CNG - మైలేజ్: 19-20 kmpl
2. మారుతీ ఆల్టో కే10 (Maruti Alto K10)
చిన్న వాహనాల ప్రపంచంలో మారుతీ ఆల్టో పేరు చెప్పనవసరం లేదు. ఆల్టో కే10కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ప్రారంభ ధర:రూ.4.23 లక్షలు
టాప్ ఎండ్ ధర:రూ. 6.2 లక్షలు
ఇంజిన్:998cc పెట్రోల్
మైలేజ్:సుమారు 24.4 kmpl
సేఫ్టీ: ఇటీవల కంపెనీ అన్ని వేరియంట్లకూ 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా కలిపింది
Details
3. రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కారు రెనాల్ట్ క్విడ్.
ప్రారంభ ధర: రూ. 4.70 లక్షలు
టాప్ ఎండ్ ధర: రూ. 6.45 లక్షలు
ఇంజిన్: 999cc పెట్రోల్
మైలేజ్: 21.5-22.3 kmpl, స్టైలిష్ డిజైన్, SUV లుక్‌లో కాంపాక్ట్ కార్
4. మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో (Maruti S-Presso)
మారుతీ నుండి వచ్చిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు ఎస్
ప్రెస్సో. ఇది SUVలా ఉండే బాడీతో, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రారంభ ధర: రూ.4.2 లక్షలు
టాప్ ఎండ్ ధర: రూ.6.12 లక్షలు
ఇంజిన్: 998cc - మైలేజ్: 24-25.3 kmpl