Page Loader
Cars launch in September : సెప్టెంబర్ లాంచ్ అయ్యే అదిరిపోయే కార్స్ ఇవే!
సెప్టెంబర్ లాంచ్ అయ్యే అదిరిపోయే కార్స్ ఇవే!

Cars launch in September : సెప్టెంబర్ లాంచ్ అయ్యే అదిరిపోయే కార్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్‌లో పండుగ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోసం దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు కొత్త ఈవీలు ప్రవేశపెట్టనున్నాయి. అటు డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేకమైన ఆఫర్లు తీసుకొస్తున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్‌లో లాంచ్ కు సిద్ధమయ్యే కార్ల గురించి తెలుసుకుందాం. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ ఇటీవలే ఆవిష్కరించారు. ఇకసెప్టెంబర్ 4 ఈ ఈవీ నాలుగు వేరియంట్లతో ముందుకు రానున్నాయి. ఇందులో 1.5 లీటర్ డీఓహెచ్‌సీ, ఐ-పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఈ వెహికల్ 119 హెచ్‌పీ పవర్‌ను, 145.1 ఎన్ఎం టార్క్‌ను చేయనుంది. ఫ్రాన్స్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ సిట్రోయెన్​.. సీ3 ఎయిర్​క్రాస్​ ఎస్​యూవీని సెప్టెంబర్​లో ఇండియాలో లాంచ్​ చేస్తుందని టాక్​ నడుస్తోంది. 1.2 లీటర్​ టర్బోఛార్జ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది.

Details

 సీ40 రీఛార్జీ ఈవీ సెప్టెంబర్ 4న రిలీజ్

సీ40 రీఛార్జీ ఈవీని సెప్టెంబర్ 4న లాంచ్ కానుంది. ఈ వెహికల్‌లో 78 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులో 402 బీహెచ్‌పీ పవర్‌ను, 660 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. టాటా నెక్సాస్ ఫేస్‌లిఫ్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ వెహికల్ సెప్టెంబర్ 14న లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇందులో 10.25 ఇ:చ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉండొచ్చు. టాటా నెక్సాస్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా ఉన్న టాటా నెక్సాన్​ ఈవీకి కూడా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. ఇంజిన్, బ్యాటరీ​ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.