AutoMobile Retail Sales : ఈసారి పండగ సీజన్లో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు.. ఏకంగా 19శాతం వృద్ధి
నవరాత్రితో మొదలై ధన త్రయోదశి వరకు మొత్తం 42 రోజుల పండుగ సీజన్ (festive season) ముగిసింది. ఈ సీజన్లో మొత్తం వాహనాల విక్రయాల సంఖ్య 31,95,213 యూనిట్ల నుంచి 37,93,584 యూనిట్లకు చేరింది. వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని ఆటో మొబైల్ (Auto mobile) డీలర్ల సమాఖ్య 'ఫాడా' ధ్రువీకరించింది. ట్రాక్టర్లు మినహాయించి అన్ని విభాగాల అమ్మకాల్లో గణనీయ వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. ఏకంగా ఈ సీజన్లో వాహనాల విక్రయాలు 19శాతం పెరగడం విశేషం. గతేడాది 31,95,213 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి ఆ సంఖ్య 37,93,584 యూనిట్లకు చేరుకుంది.
వాణిజ్య విక్రయాలు ఎనిమిది శాతం పెరుగుదల
మరోవైపు ప్రయాణికుల వాహన విక్రయాలు 4,96,047 యూనిట్ల నుంచి 10శాతం పెరిగి 5,47,246 యూనిట్లకు చేరాయి. అయితే దీపావళి నుంచి విక్రయాలు బాగా పుంజుకున్నాయని మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ విభాగంలో ఎస్‌యూవీలు రికార్డు సాధించాయన్నారు. నూతన ద్విచక్ర వాహన విక్రయాల్లో 21 శాతం వృద్ధి సాధించింది. క్రితం ఏడాది ఏడాది 23,96,665 యూనిట్లు అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 28,93,107 యూనిట్లకు చేరింది. వాణిజ్య వాహన విక్రయాలు ఎనిమిది శాతం పెరిగాయి.