Page Loader
20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు

20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 14, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో MPV డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాలు SUV లాగానే విశాలంగా ఉంటాయి. ప్రయాణీకుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని Renault, మారుతి సుజుకీ, కియా మోటార్స్, మహీంద్రా, టయోటా వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయి. Renault TRIBER: ప్రారంభ ధర రూ. 6.33 లక్షలు. లోపల ఏడు సీట్లు, వెనుక కెమెరా, ఒకటి కంటే ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. మారుతీ సుజుకి Ertiga: ధర రూ. 8.35 లక్షలు. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో ఉన్న ఏడు-సీట్ల క్యాబిన్, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, 1.5-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది.

కార్

మహీంద్రా Marazzo 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది

కియా Carens: ధర రూ. 10.2 లక్షలు. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. MPV 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 1.5-లీటర్ పెట్రోల్ మిల్లుతో, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ తో నడుస్తుంది. మహీంద్రా Marazzo: ధర రూ. 13.71 లక్షలు. లోపల ఎనిమిది సీట్లు, USB ఛార్జర్‌లు, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు లోపల అందుబాటులో ఉన్నాయి. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది. టయోటా Innova Hycross: ధర రూ. 18.3 లక్షలు. ఇది ఆరు/ఏడు-సీట్ల క్యాబిన్‌ తో వస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌లు ఉన్నాయి. 2.0-లీటర్, ఇన్‌లైన్, TNGA పెట్రోల్ ఇంజన్ 2.0-లీటర్, TNGA పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది.