
భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటో మొబైల్ మార్కెట్, ఇందులో ఈ Renault, Nissan తయారీ సంస్థలకు దాదాపు 3% మార్కెట్ వాటా ఉంది. ఇప్పుడు ఈ సంస్థలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త మోడళ్ల పరిచయం, వాహనాల క్రాస్ బ్యాడ్జింగ్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించాలని నిర్ణయించుకున్నాయి.
కార్
Renault, Nissan సంస్థలు గత 24 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాయి
రాబోయే Duster CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌తో Dacia Bigster కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్‌గా ఉండకచని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 5/7-సీటర్ క్యాబిన్, హైబ్రిడ్, EV పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. ఇది 2025లో భారతదేశంలో లాంచ్ అవుతుంది. హ్యుందాయ్ Kreta, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు ఇది పోటీగా ఉంటుంది. నిస్సాన్ SUV CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉత్పత్తి దశలో ఉంది.
Renault, Nissan సంస్థలు గత 24 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు, రెండు కంపెనీలకు 15% క్రాస్ షేర్ హోల్డింగ్ ఉంది. ఐరోపాలోని Renault EV విభాగంలో కూడా Nissan గణనీయమైన పెట్టుబడి పెట్టింది.