LOADING...
Maruti Suzuki Wagon R : రూ.10 లక్షల లోపే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌.. వాగన్‌ ఆర్‌ ధరలు ఇవే!
రూ.10 లక్షల లోపే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌.. వాగన్‌ ఆర్‌ ధరలు ఇవే!

Maruti Suzuki Wagon R : రూ.10 లక్షల లోపే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌.. వాగన్‌ ఆర్‌ ధరలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతీ సుజుకీ వాగన్‌ ఆర్‌ ఒకటి. ఈ కారుతో సంస్థ సేల్స్‌లో కీలక వాటాను నమోదు చేస్తోంది. తక్కువ ధరలో కారును కొనాలనుకునే వారికి వాగన్‌ ఆర్‌ మంచి ఎంపికగా మారుతోంది. అందుకే మార్కెట్లో ఈ మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. మీరు కూడా బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటే, రూ. 10 లక్షల లోపు టాప్‌ ఎండ్‌ మోడల్‌ వచ్చే వాహనం వాగన్‌ ఆర్‌ కావచ్చు. హైదరాబాద్‌లో ఈ కారుకు సంబంధించిన ధరలు, వెర్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Details

హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ వాగన్‌ ఆర్‌ ఆన్‌రోడ్‌ ధరలు

ఎల్‌ఎక్స్‌ఐ (LXi)-రూ. 6.88 లక్షలు వీఎక్స్‌ఐ (VXi) - రూ. 7.41 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ (ZXi)-రూ. 7.80 లక్షలు వీఎక్స్‌ఐ ఏటీ (VXi AMT) - రూ. 7.99 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ (ZXi Plus) - రూ. 8.36 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ఏటీ (ZXi AMT) - రూ. 8.39 లక్షలు వీఎక్స్‌ఐ సీఎన్‌జీ (VXi CNG)- రూ. 8.46 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ డ్యూయెల్‌ టోన్‌ (ZXi Dual Tone) - రూ. 8.50 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏటీ (ZXi Plus AMT)- రూ. 8.95 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏటీ డ్యూయెల్‌ టోన్‌ (ZXi Plus AMT Dual Tone)- రూ. 9.09 లక్షలు

Details

వీఎక్స్‌ఐ సీఎన్‌జీ వేరియంట్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి 

అంటే మొత్తం మీద హైదరాబాద్‌లో వాగన్‌ ఆర్‌ ఆన్‌రోడ్‌ ధరలు రూ. 6.88 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యగా ఉన్నాయి. ఇందులో వీఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ సీఎన్‌జీ వేరియంట్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సీఎన్‌జీ మోడల్స్‌ను మినహాయిస్తే మిగతావన్నీ పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్లే. డీజిల్‌ వేరియంట్‌ వాగన్‌ ఆర్‌లో అందుబాటులో లేదు. కార్లను లాంచ్‌ చేసే సమయంలో సంస్థలు సాధారణంగా ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ వాస్తవంగా వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం మాత్రం ఆన్‌రోడ్‌ ధరే.

Details

'ఆన్‌రోడ్‌ ప్రైజ్‌' చెక్ చేసుకోవాలి

ఇందులో రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌, ఇతర ఫీజులు కలిపి మొత్తం ఖర్చు వుంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఈ చార్జీలు భిన్నంగా ఉండటం వల్లే ఆన్‌రోడ్‌ ధర వేరుగా ఉంటుంది. కావున, మీరు ఏదైనా కారు కొనే ముందు, దాని ఎక్స్‌షోరూం ధర కాకుండా 'ఆన్‌రోడ్‌ ప్రైజ్‌' ఎంత ఉందో ముందుగా తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల మీ బడ్జెట్‌ అంచనాలు సరిగ్గా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే, సమీప మారుతీ సుజుకీ డీలర్‌షిప్‌ షోరూం‌ను సందర్శించి టెస్ట్‌డ్రైవ్‌ చేయడమేగాక, అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి కూడా సమాచారం తీసుకోవచ్చు. దీని ద్వారా కొనుగోలు సమయంలో మరింత ప్రయోజనం పొందే అవకాశముంది.