Page Loader
Toyota: తొలిసారిగా దేశరాజధానిలో టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ 
Toyota: తొలిసారిగా దేశరాజధానిలో టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్

Toyota: తొలిసారిగా దేశరాజధానిలో టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కంపెనీల కార్ల తరహాలోనే టొయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ ను తొలిసారిగా దేశరాజధాని లో మొదలు పెట్టింది. టొయోటా తన మొదటి టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ (TUCO)ని 'టయోటా U-ట్రస్ట్' బ్రాండ్ క్రింద న్యూదిల్లీలో ప్రారంభించింది. కొత్త ప్రీఓన్డ్ కార్ డీలర్‌షిప్ కు కనీసం 15,000sq. ft., స్ధలం వుండాలి. ఇందులో వాహన తయారీదారుచే ధృవీకరించబడిన 20 వాహనాలకు పైగా ప్రదర్శించవచ్చు. ప్రీఓన్డ్ టయోటా కార్ల కొనుగోలు , విక్రయ సమయంలో వినియోగదారులకు సౌలభ్యం, పారదర్శకత వుండాలని కంపెనీ ఆలోచనగా వుంది. కస్టమర్ల సంతృప్తి, మనశ్శాంతిని అందించడానికి ప్రాధాన్యత అని తెలిపింది. అందు కోసమే ఈ అవుట్‌లెట్ రూపొందించారు.

నాణ్యత హామీ 

టయోటా ప్రీఓన్డ్ కారు తనిఖీ 

TUCO వద్ద ప్రతి ప్రీవోన్డ్ కారు భద్రత, నిర్మాణ దృఢత్వం , పనితీరు తనిఖీలన్నీ గ్లోబల్ టొయోటా ప్రమాణాల ఆధారంగా రూపొందించారు. కఠినమైన 203-పాయింట్ తనిఖీ ప్రక్రియ ముగిశాకే వాహనం బయటకు వెళుతుంది. కొత్త TUCO షోరూమ్‌లు కంపెనీకి చెందిన ఏదైనా అవుట్‌లెట్‌ల నుండి బ్రాండ్-న్యూ కారును కొనుగోలు చేసినట్లుగా వుంటుంది. అదే వాతావరణం కస్టమర్ సంతృప్తిని ప్రతిబింబించే లక్ష్యంతో పని చేస్తాయి. టయోటా ప్రకారం, కొనుగోలుదారులకు పూర్తి డాక్యుమెంటేషన్, సరసమైన పోటీ ధర సమగ్ర వాహన చరిత్ర అందించబడుతుంది.

వ్యాపార వ్యూహం 

నాణ్యత , కస్టమర్ సంతృప్తి కోసం టయోటా నిబద్ధత 

భారతదేశంలో టయోటా మొత్తం వ్యాపారం , వృద్ధి వ్యూహంలో యూజ్డ్ కార్ల వ్యాపారం కీలక స్తంభమన్నారు టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ తకాషి తకామియా. న్యూ ఢిల్లీలో మొదటి యూజ్డ్ కార్ అవుట్‌లెట్ ప్రారంభోత్సవం నాణ్యత, విశ్వసనీయత , కస్టమర్ సంతృప్తి పట్ల వారి అంకితభావాన్ని తెలియ చెపుతుంది.

వినియోగదారుని మద్దతు 

టయోటా అమ్మకాల తర్వాత సేవ , ఆన్‌లైన్ మూల్యాంకనం 

అమ్మకాల తర్వాత ఎటువంటి అవాంతరాలు లేని సర్వీస్ అందిస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ స్పష్టం చేశారు. ఇది కంపెనీ నిబద్ధత నిదర్శనమన్నారు. మా ప్రత్యేక కేంద్రాలలో టొయోటా నిజమైన విడిభాగాలను ఉపయోగిస్తారని ఆయన చెప్పారు. మా సొంత సాంకేతిక నిపుణులచే , ప్రతి పూర్వ-యాజమాన్య వాహనం పునర్నిర్మాణమవుతుందని సూద్ పేర్కొన్నారు. వినియోగదారులు 'టయోటా U-ట్రస్ట్' వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వాహనాలను అంచనా వేయవచ్చు. ప్రతి ప్రీవోన్డ్ కారు గరిష్టంగా 30,000 కిమీ, రెండు సంవత్సరాల వరకు వారంటీతో వస్తుంది.

మార్కెట్ ఔట్ లుక్ 

భారతదేశంలో ఉపయోగించిన కార్ల మార్కెట్ వృద్ధి సంభావ్యత 

కార్ల రిపేర్లను పరిష్కరించే సంస్ధ దీనిని (Takamiya) గా పిలుస్తారు అంతర్జాతీయంగా. ఇది భారతదేశంలో ఉపయోగించిన కార్ల మార్కెట్ గణనీయమైన వృద్ధి సామర్థ్యాన్ని హైలైట్ చేసింది. ఇది ప్రస్తుతం కొత్త కార్ మార్కెట్ కంటే 1.3 రెట్లు ఎక్కువ , 8% వార్షిక వృద్ధి ( CAGR) వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. న్యూ ఢిల్లీలో మొట్టమొదటి యూజ్డ్ కార్ అవుట్‌లెట్ ప్రారంభోత్సవం TUCO విస్తరణకు అద్దం పడుతోంది. పెరుగుతున్న ఈ రంగానికి టయోటా అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.