Toyota Land Cruiser FJ: టయోటా కొత్త ఎఫ్‌జె ఎస్‌యూవీ ఎంట్రీ.. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ల్యాండ్ క్రూయిజర్
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టయోటా థాయ్‌లాండ్ మార్కెట్లో కొత్తగా 'టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ'ను విడుదల చేసింది. ఈ SUV ఆధునిక ఫీచర్లతో పాటు ఆఫ్‌రోడ్ సామర్థ్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త మోడల్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, బాడీ క్లాడింగ్, టెయిల్‌గేట్‌పై స్పేర్ టైర్ వంటి ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా చూస్తే 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, ఆటో-డిమ్మింగ్ IRVM, 2.5 అంగుళాల ఎయిర్ ఫిల్టర్ వంటి సౌకర్యాలు అందించారు.
వివరాలు
ఈ SUVలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు
భద్రత విషయంలో కూడా ఈ SUVలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ వ్యూ మానిటర్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ADAS వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ పరంగా ఈ వాహనంలో 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 166 PS పవర్, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. అలాగే 4WD సిస్టమ్, డిఫరెన్షియల్ లాక్ వంటి ఆఫ్‌రోడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
వివరాలు
ధర ఎంతంటే?
ధర విషయానికి వస్తే, థాయ్‌లాండ్‌లో ఈ SUVను THB 12.69 లక్షల ధరకు విడుదల చేశారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.36 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ 'టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ' 2026 చివరి నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.