LOADING...
Toyota: టయోటా నూతన వ్యూహం.. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ ఎగుమతులపై ఫోకస్
టయోటా నూతన వ్యూహం.. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ ఎగుమతులపై ఫోకస్

Toyota: టయోటా నూతన వ్యూహం.. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ ఎగుమతులపై ఫోకస్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ భారత్‌లో భారీ తయారీ విస్తరణకు సిద్ధమవుతోంది. దేశంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచి 2030ల నాటికి ఏడాదికి 10 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహారాష్ట్రలో మూడు కొత్త వాహన అసెంబ్లీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిక్కే నివేదిక వెల్లడించింది.

వివరాలు

 ₹1.9 బిలియన్ల పెట్టుబడి.. మూడు ప్లాంట్లు

ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 300 బిలియన్ యెన్‌ (దాదాపు 1.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. మొదటి ప్లాంట్‌ 2029 ప్రాంతంలో ప్రారంభం కానుండగా, మిగిలిన రెండు ప్లాంట్లు 2030ల ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే, దక్షిణ భారతదేశంలో ఇప్పటికే ఉన్న ప్లాంట్లతో కలిపి టయోటా మొత్తం తయారీ యూనిట్లు ఆరుకు పెరుగుతాయి.

వివరాలు

ఎగుమతుల దిశగా కొత్త వ్యూహం

ప్రస్తుతం భారత్‌లో టయోటా కార్యకలాపాలు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, కొత్త ప్లాంట్లు ఎగుమతులకు కీలక కేంద్రాలుగా మారనున్నాయి. ఈ యూనిట్లలో తయారయ్యే వాహనాలు పశ్చిమ ఆసియా, ఆఫ్రికా మార్కెట్లకు పంపిణీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలోని ముంబై వంటి ప్రధాన పోర్టులకు సమీపం ఉండటం వల్ల ఎగుమతులకు అనుకూల పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

టయోటాకు భారత్ కీలక కేంద్రం

ఈ విస్తరణతో టయోటాకు భారత్ నాలుగో అతిపెద్ద తయారీ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం జపాన్, చైనా, అమెరికా తర్వాత భారత్ ఈ స్థానం పొందే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా నిలిచింది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2030 నాటికి వార్షిక వాహన విక్రయాలు 6.44 మిలియన్ యూనిట్లకు చేరవచ్చు.

Advertisement

వివరాలు

ఎస్‌యూవీలు, హైబ్రిడ్‌లపై దృష్టి

భారత్ మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టయోటా కొత్త మూడు వరుసల SUVను 'కొరోల్లా' బ్రాండ్ కింద ప్రవేశపెట్టే యోచనలో ఉంది. చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి దశలో ఉన్న నేపథ్యంలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది. భారత్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగిస్తుండగా, హ్యుందాయ్ మోటార్ కంపెనీ ముఖ్యంగా SUV విభాగంలో తన స్థాయిని పెంచుకుంటోంది. ఇదే సమయంలో టయోటా, సుజుకి మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ భారత్‌లో తయారైన వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడళ్లను వినియోగిస్తోంది. మొత్తంగా టయోటా ఈ విస్తరణతో భారత్‌ను గ్లోబల్ ఉత్పత్తి కేంద్రంగా మలచుకోవాలని స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది.

Advertisement