Page Loader
Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్
అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్

Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ దిగ్గజ సంస్థ టయోటా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా టయోటా ఏకంగా 21,000 యూనిట్లు సేల్స్ చేయడం విశేషం. ఇండియాలో 20వేల కంటే ఎక్కువ వాహనాలను విక్రయించామని, అదే విధంగా ఇతర దేశాలకు వెయ్యికి పైగా వాహనాలను సేల్స్ చేశామని టయోటా కంపెనీ స్పష్టం చేసింది. సెప్టెంబరులో అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, అక్టోబర్‌లో పండుగ డిమాండ్ కారణంగా టయోటా అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్‌తో పోల్చితే 66శాతం అమ్మకాలు పెరగ్గా, కంపెనీ 21,879 యూనిట్లను పంపిణీ చేసింది. అక్టోబర్ 2022లో కేవలం 13,143 యూనిట్లను మాత్రమే సేల్స్ చేసింది. ఇక సెప్టెంబర్‌లో టయోటా డెలివరీ చేసింది.

Details

15శాతం పెరిగిన హ్యుందాయ్ అమ్మకాలు

2023 ప్రథమార్థంలో టయోటా ఇండియా విక్రయాలు 35శాతం పెరిగి 123,939 యూనిట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో 91,843 యూనిట్లు అమ్ముడుపయాయి. కంపెనీ అమ్మకాల పరంగా ప్రతేడాది రికార్డులను బద్దలు కొట్టింది. మరోవైపు టయోటా తన షోరూమ్‌ల సంఖ్యను 577 నుండి 612కి విస్తరించింది. హ్యుందాయ్ అక్టోబర్ 2023లో అమ్మకాలు 15శాతం పెరిగి 55,128 యూనిట్లకు చేరుకుందని ప్రకటించింది, గత ఏడాది ఇదే నెలలో హ్యుందాయ్ 48,001 యూనిట్లను విక్రయించింది. ఇండియాలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్‌లో 7శాతం పెరగడం గమనార్హం. ఆ సంస్థ గత నెలలో ICE-ఆధారిత వాహనాలు, EVలతో సహా 48,337 కార్లను విక్రయించింది.