LOADING...
Triumph 350cc Motorcycles: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రానున్న ట్రయంఫ్ 350సీసీ మోడల్స్
బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రానున్న ట్రయంఫ్ 350సీసీ మోడల్స్

Triumph 350cc Motorcycles: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రానున్న ట్రయంఫ్ 350సీసీ మోడల్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్స్ కొత్తగా 350సీసీ బైకుల శ్రేణిని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడళ్లను 2026 ఏప్రిల్ 6న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే బజాజ్ ఆటో భాగస్వామ్యంలో తీసుకొచ్చిన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400ఎక్స్ మోడళ్లకు మంచి స్పందన వస్తోంది. మరోవైపు పెద్ద మార్కెట్‌ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి వదులుతోంది.

వివరాలు

తక్కువ జీఎస్టీతో ధరలు తగ్గే అవకాశం

భారత్‌లో జీఎస్టీ నిబంధనల ప్రకారం 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులకు 18 శాతం పన్ను మాత్రమే ఉంటుంది. అయితే 350సీసీ పైబడి ఉన్న మోడళ్లకు సుమారు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. ఈ కారణంగా ట్రయంఫ్ కొత్తగా 350సీసీ కేటగిరీలోనే బైకులను తీసుకురావడం ద్వారా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్, క్లాసిక్ 350, హోండా సీబీ 350, అలాగే హార్లే డేవిడ్షన్ ఎక్స్ 440 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో ట్రయంఫ్ బ్రాండ్ ఈ సెగ్మెంట్‌లో మరింత బలపడే అవకాశం ఉంది.

వివరాలు

 కొద్దిగా పవర్ తగ్గే అవకాశం..

ఈ కొత్త బైకుల సాంకేతిక వివరాలను ట్రయంఫ్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే 400సీసీ ఇంజిన్‌తో పోలిస్తే ఈ మోడళ్లలో పవర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 4 నుంచి 5 హార్స్ పవర్ వరకు తగ్గవచ్చని అంచనా. అయితే లో-ఎండ్ టార్క్, స్మూత్ పనితీరు, మంచి ఎగ్జాస్ట్ సౌండ్‌పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముంది. ప్రస్తుతం బజాజ్ ఆటో సంస్థ బజాజ్, కేటీఎం, హుస్క్వర్నా, ట్రయంఫ్ బ్రాండ్ల కింద బైకులను తయారు చేస్తోంది. భవిష్యత్తులో ఈ బ్రాండ్లు కూడా 350సీసీ కేటగిరీలో మోడళ్లను తీసుకువచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ధర-పవర్ మధ్య సరైన సమతౌల్యం కలిగిన బైకులు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement