Page Loader
2023 చివరి నాటికి  భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్
ఇది సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో నడుస్తుంది

2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 28, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు, బైక్ ప్రొడక్షన్-రెడీ టెస్ట్ మ్యూల్ ఇక్కడ స్పోక్ వీల్స్, క్రాష్ గార్డ్ వంటి భాగాలతో పరీక్షిస్తున్నారు . ఇది లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. Triumph బజాజ్ ఆటో జనవరి 2020లో బైక్‌లను తయారు చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మార్కెట్లో జోంటెస్ GK350, హోండా CB300R, BMW G 310 R తో పోటీపడుతుంది. Triumph-బజాజ్ రోడ్‌స్టర్‌లో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీటు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, సర్క్యులర్ మిర్రర్లు, హెడ్‌లైట్ పైన నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంటాయి.

బైక్

రైడర్ భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS ఉంది

బైక్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ గార్డ్, LED సెటప్‌ ఉంటుంది. దీని కొలతలు, రంగు ఆప్షన్స్, ఫ్యూయెల్ స్టోరేజ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది 350-400cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు, ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. Triumph-బజాజ్ రోడ్‌స్టర్ ధర, ఇతర వివరాలు దాని లాంచ్ సమయంలో ప్రకటిస్తారు. అయితే, భారతదేశంలో, బైక్ ధర సుమారు రూ. 2.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చు.