Triumph Scrambler 400 X: లేటస్ట్ ఫీచర్స్ తో వచ్చేసిన ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X.. ధర కూడా తక్కువే!
బజాజ్ సహకారంతో బ్రిటీష్ మోటార్ సైకిల్ తయారీదారు ట్రయంఫ్, గత జూన్‌లో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 X పేరిట రెండు కొత్త బైకులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే 400 సీసీ సెగ్మెంట్ బైక్స్ లోకి స్క్రాంబ్లర్ 400 ఎక్స్ చేసింది. ఈ బైక్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రయంఫ్ స్పీడ్ 400 తో పోలిస్తే స్క్రాంబ్లర్ 400 ఎక్స్ డిజైన్ లోనే కాకుండా మెకానికల్ విభాగంలో కూడా చాలా మార్పులు చేశారు. ఈ బైక్ పెద్ద ఫ్రంట్ వీల్, నకల్ గార్డ్ లు, హెడ్ లైట్ గ్రిల్, బాష్ ప్లేట్, స్ప్లిట్ సీట్ సెటపర్, స్ప్లిట్ గ్రాబ్ వంటి ఫీచర్స్ తో రానుంది.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర రూ.2.63 లక్షలు
స్క్రాంబ్లర్ 400 ఎక్స్ లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్ తో 19 అంగుళాల ఫ్రంట్ వీల్ ఉంది. ఇక స్పీడ్ 400లో ఉన్న బ్రేక్ ప్యాడ్‌లను ట్రయంఫ్ లో ఉపయోగించలేదు. డిజిటల్ యూనిట్‌లో టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గాగ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్, పెట్రోల్ క్వాంటిటీ, మైలేజీ, క్లాక్ వంటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్‌తో రానుంది. మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే టైప్ సి ఛార్జింగ్ పోర్టు ఇందులో ఉంది. ఇది 39.5 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37.5 ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 2.63 లక్షల లోపు ఉండనుంది.