ఇండియన్ మార్కెట్లోకి ట్రయంఫ్, స్క్రాంబ్లర్ 400X బైక్స్.. ఫీచర్లు ఇవే
బ్రిటిష్ మోటర్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ కొత్త రెండు బైకులు ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X' బైకులను ఎట్టకేలకు పరిచయం చేసిది. ఈ రెండు బైకులు కూడా జులై 5న భారత్‌లో విడుదల కానున్నాయి. బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ రెండు వాహనాలకు సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X బైకులు నియో రెట్రో థీమ్‌తో టియర్ డ్రాప్ తరహా ఇంధన ట్యాంకు, హెడ్ లైట్లు, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, రేర్‌వ్యూ మిర్రర్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు వృత్తాకార డిజైన్ కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడల్ బైక్‌లు ప్రీమియం హార్డ్‌వేర్‌తో వచ్చాయి.
రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇవ్వనున్న ట్రయంఫ్, స్క్రాంబ్లర్ 400X బైక్స్
ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్, స్క్రాంబ్లర్ 400X రెండు ద్విచక్రవాహనాలు వెనుకవైపు ప్లోటింగ్ కాలిపర్లతో కూడిన 230mm ఫిక్సిడ్ డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. 4 పిస్టన్ కాలిపర్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ ABS సపోర్టును ముందు టైర్లు కలిగి ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఫ్రంట్‌డిస్క్ 300ఎంఎం, స్క్రాంబ్లర్ 400X 320ఎంఎం ఉంది. రెండు వాహనాలు అత్యుత్తమ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉండడం విశేషం. ఈ రెండు బైక్‌ల ధర సుమారుగా రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ బైకులు భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.