LOADING...
TVS Apache: 20 ఏళ్లలో 70 లక్షల అమ్మకాలతో టీవీఎస్ అపాచే కొత్త రికార్డు
20 ఏళ్లలో 70 లక్షల అమ్మకాలతో టీవీఎస్ అపాచే కొత్త రికార్డు

TVS Apache: 20 ఏళ్లలో 70 లక్షల అమ్మకాలతో టీవీఎస్ అపాచే కొత్త రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన టీవీఎస్ అపాచే మోటార్‌సైకిల్ శ్రేణి ప్రపంచవ్యాప్తంగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2005లో ప్రారంభమైన ఈ బ్రాండ్ ఇప్పటివరకు 90కి పైగా దేశాల్లో 70 లక్షల (7 మిలియన్) యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని 'టు రేస్ లగా' (Tu Race Laga) పేరుతో కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా అపాచే బ్రాండ్‌కు చెందిన 'ట్రాక్ టు రోడ్' స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అపాచే శ్రేణిలో పలు విభాగాల్లో తొలిసారిగా ఆధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీవీఎస్ తెలిపింది.

వివరాలు 

అపాచే బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకుపైగా వినియోగదారులు

వీటిలో రోటో-పెటల్ డిస్క్ బ్రేకులు, ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ, బిల్ట్-టు-ఆర్డర్ (BTO) కస్టమైజేషన్ ప్లాట్‌ఫారం, కీ లెస్ రైడ్ సిస్టమ్తో పాటు ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ సిస్టమ్ వంటి రైడర్ సహాయక సాంకేతికతలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం అపాచే బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకుపైగా వినియోగదారులు ఉన్నారని తెలిపింది. అపాచే యజమానుల సమూహం కూడా గణనీయంగా విస్తరించిందని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా, విదేశాల్లో నిర్వహిస్తున్న రైడింగ్ ఈవెంట్లు, ట్రాక్ అనుభవాలు, రైడర్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం 5 లక్షల మంది సభ్యులతో కూడిన ఓనర్ కమ్యూనిటీ ఏర్పడిందని పేర్కొంది.

వివరాలు 

'టు రేస్ లగా' ప్రచార చిత్రానికి రామ్ మాధ్వాని దర్శకత్వం

ఈ మైలురాయిని పురస్కరించుకుని రూపొందించిన'టు రేస్ లగా' ప్రచార చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ భారతీయ దర్శకుడు రామ్ మాధ్వాని దర్శకత్వం వహించారు. అపాచే బ్రాండ్ ప్రయాణం, రైడర్లతో ఏర్పడిన అనుబంధాన్ని ఈ ప్రచార చిత్రం ప్రతిబింబిస్తుందని కంపెనీ తెలిపింది. 70 లక్షల విక్రయాల మైలురాయిని చేరిన టీవీఎస్ అపాచేలో 70లక్షవ మోటార్‌సైకిల్ అపాచే ఆర్‌ఆర్ 310గా నమోదైంది 2005లో ప్రారంభమైన ఈ బ్రాండ్ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్‌షిప్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా ఉన్న ఆర్‌ఆర్ 310ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.62 లక్షలు. ఇందులో ట్రాక్‌కు అనుగుణంగా రూపొందించిన చాసిస్‌తో పాటు 312సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందుబాటులో ఉంది.

Advertisement

వివరాలు 

టీవీఎస్ అపాచే శ్రేణి మూడు విభాగాల్లో అందుబాటులో..

ప్రస్తుతం టీవీఎస్ అపాచే శ్రేణి స్ట్రీట్ నేకెడ్, సూపర్‌స్పోర్ట్, అడ్వెంచర్ టూరర్ అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంది. స్ట్రీట్ నేకెడ్ విభాగంలో ఆర్‌టీఆర్ 160, ఆర్‌టీఆర్ 160 4వి, ఆర్‌టీఆర్ 180, ఆర్‌టీఆర్ 200 4వి, ఆర్‌టీఆర్ 310 మోడళ్లు ఉన్నాయి. సూపర్‌స్పోర్ట్ విభాగంలో ఆర్‌ఆర్ 310 కొనసాగుతుండగా, ఇటీవల పరిచయమైన ఆర్‌టీఎక్స్ (RTX)తో అడ్వెంచర్ టూరర్ విభాగంలో కూడా టీవీఎస్ అడుగుపెట్టింది.

Advertisement