TVS King EV MAX: కింగ్ సైజ్ ఫీచర్లతో టీవీఎస్ ఈవీ మ్యాక్స్.. సింగిల్ ఛార్జ్‌లో 179KM!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి శుభవార్త. తక్కువ ధరలో ప్రీమియమ్ ఫీచర్లతో టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్, పేరుకు అనుగుణంగా కింగ్ సైజ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
అద్భుతమైన రేంజ్, వేగంతో పాటు తక్కువ ధర అందించడం ఈ వాహన ప్రత్యేకత. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధరను కంపెనీ రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది.
సింగిల్ ఛార్జ్‌తో 179 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది.
Details
ఆరు సంవత్సరాలు వారంటీ
కింగ్ ఈవీ మ్యాక్స్ కోసం టీవీఎస్ 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది.
ఇందులో అధిక పనితీరు కలిగిన 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీ ఉంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఈ ఆటో ఎకో మోడ్‌లో 40 kmph, సిటీ మోడ్‌లో 50 kmph, పవర్ మోడ్‌లో 60 kmph వేగంతో సాగుతుంది.
బ్యాటరీ కేవలం 3 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, 31% గ్రేడబిలిటీ, 500mm వరకు వాటర్ వాడింగ్ సామర్థ్యం, విశాలమైన క్యాబిన్, ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Details
త్వరలోనే డెలివరీలు ప్రారంభం
TVS స్మార్ట్‌కనెక్ట్ ద్వారా టెలిమాటిక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ లభిస్తుంది. TVS SmartXonnect సాయంతో ఈ ఆటోను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయవచ్చు.
డ్రైవింగ్ చేస్తూ సంగీతం వినడం, డిస్ప్లేలో మ్యాప్ చూడడం, రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్‌లు, వెహికల్ డయాగ్నస్టిక్స్ వంటి ఫీచర్లను అందించారు.
దేశ వ్యాప్తంగా డెలివరీలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు టీవీఎస్ మోటార్ ప్రకటించింది.
ఈ ఎలక్ట్రిక్ ఆటో తక్కువ ధరలో గరిష్ట పనితీరు అందించడంతో పర్యావరణ హితమైన ప్రయాణానికి ఇది సరైన ఎంపికగా నిలవనుంది.