Page Loader
TVS Jupiter 125 DT SXC: కనెక్టివిటీ ఫీచర్లతో టీవీఎస్ జుపిటర్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి!
కనెక్టివిటీ ఫీచర్లతో టీవీఎస్ జుపిటర్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి!

TVS Jupiter 125 DT SXC: కనెక్టివిటీ ఫీచర్లతో టీవీఎస్ జుపిటర్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారైన టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రాచుర్యం పొందిన స్కూటర్ 'జుపిటర్ 125'కి కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే టీజర్ల రూపంలో ప్రచారం పొందిన ఈ వేరియంట్‌కు ఇప్పుడు అధికారికంగా 'జుపిటర్ 125 DT SXC'గా విడుదల చేసినట్టు కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధరను రూ. 80,740 (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.

Details

ఆకర్షణీయమైన డిజైన్ అప్‌డేట్లు

ఈ కొత్త వేరియంట్‌ ప్రత్యేకతల్లో భాగంగా ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్ టోన్ కలర్స్‌లో లభించనుంది. అంతేకాకుండా స్కూటర్‌కు డ్యూయల్ టోన్ ఇన్నర్ ప్యానల్స్, అదే షేడులో ఉండే ఫ్లాట్ సింగిల్ పీస్ సీట్, 3D ఎంబ్లెమ్స్, బాడీ కలర్ గ్రాబ్ రైల్ వంటి స్టైలిష్ ఎలిమెంట్లు కలిపారు. ఈ వేరియంట్‌కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సమకూర్చారు.

Details

 SmartXonnect టెక్నాలజీతో ఫీచర్ల ఊచకోత

టీవీఎస్ అందించిన SmartXonnect కనెక్టివిటీ సపోర్ట్‌తో ఈ స్కూటర్ మరింత ఆధునికంగా మారింది. వినియోగదారులు ఇందులో వాహన ట్రాకింగ్, వాయిస్ కమాండ్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అలాగే SMS, కాల్ అలర్ట్స్ వంటి సదుపాయాలను పొందవచ్చు. టెక్నాలజీ పరంగా ఇది యువ వినియోగదారులను మక్కువ కలిగించేలా ఉంది. ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు ఇతర వేరియంట్ల మాదిరిగానే ఈ DT SXCకి కూడా అదే మెకానికల్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక 3-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్సార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు 220 mm డిస్క్ బ్రేక్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ అందించారు.

Details

శక్తివంతమైన ఇంజిన్ పనితీరు

ఈ స్కూటర్‌కు 124.8cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ లభిస్తుంది. ఇది 8 హెచ్‌పీ శక్తిని, 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ ట్రాన్స్మిషన్ అమర్చారు. డైలీ యూజ్‌కి, సిటీ రైడింగ్‌కి ఇదొక సరైన ఎంపికగా కనిపిస్తోంది. ఈ కొత్త వేరియంట్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న హోండా ఆక్టివా 125, సుజుకి యాక్సెస్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా ఉంది. డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా కొత్త జుపిటర్ 125 DT SXC వినియోగదారులను ఆకట్టుకునేలా అన్ని అంశాలకూ బలమైన అప్‌డేట్‌లతో వచ్చింది.