
TVS: టీవీఎస్ నుంచి దేశంలో మొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ - ప్రత్యేక ఫీచర్లతో!
ఈ వార్తాకథనం ఏంటి
టీవీఎస్ మోటార్స్ ఇటీవల తన కొత్త హైపర్ స్పోర్ట్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరే TVS NTORQ 150. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన హైపర్ స్పోర్ట్ స్కూటర్‌గా పరిచయం అయ్యింది. 149.7సీసీ రేస్-ట్యూన్డ్ ఇంజిన్‌తో, ఈ స్కూటర్ అత్యధిక పనితీరు,స్పోర్టీ డిజైన్, ఆధునిక సాంకేతికతల కలయికను అందిస్తుంది. ప్రత్యేకంగా కొత్త తరం రైడర్‌ల కోసం రూపొందించిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఆల్-ఇండియా)గా నిర్ణయించబడింది. టాప్ TFT మోడల్ ధర కూడా ఇదే.
వివరాలు
ప్రధాన ఫీచర్లు:
TVS NTORQ 150 లో మల్టీపాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు,ఏరోడైనమిక్ వింగ్‌లెట్‌లు,రంగురంగుల అల్లాయ్ వీల్స్,సిగ్నేచర్ మఫ్లర్ సౌండ్ ఉన్నాయి. హై-రెసల్యూషన్ TFT క్లస్టర్‌లో Alexa,స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్,లైవ్ ట్రాకింగ్,నావిగేషన్,OTA అప్‌డేట్‌లు వంటి 50కంటే ఎక్కువ స్మార్ట్ ఫీచర్లు కలిపారు. దీని వల్ల ఈ స్కూటర్ తన విభాగంలో అత్యంత ఆధునిక మోడల్‌గా నిలిచింది. ఇంజిన్,పనితీరు: ఈ స్కూటర్ 149.7cc ఎయిర్-కూల్డ్ O3CTech ఇంజిన్‌తో పనిచేస్తుంది.7000 rpm వద్ద 13.2 PS శక్తిని, 5500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0-60 కిమీ/గం వేగాన్ని చేరుతుంది. గరిష్ట వేగం 104 కిమీ/గం. ఈ గుణాలతో NTORQ 150 తన విభాగంలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా గుర్తింపు పొందింది.
వివరాలు
డిజైన్ - స్పోర్టీ & ఫ్యూచరిస్టిక్:
డిజైన్‌లో స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రేరణ పొందిన మల్టీపాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ టెయిల్ లాంప్‌లు ఉన్నాయి. ఏరోడైనమిక్ వింగ్‌లెట్‌లు, జెట్-ప్రేరేపిత వెంట్స్, సిగ్నేచర్ మఫ్లర్ సౌండ్, నేకెడ్ హ్యాండిల్‌బార్లు, రంగు అల్లాయ్ వీల్స్, స్పోర్ట్-ట్యూన్డ్ సస్పెన్షన్ ఉన్నాయి. సిగ్నేచర్ T టెయిల్ లాంప్, గేమింగ్ కన్సోల్-ప్రేరేపిత TFT డిస్‌ప్లే ఈ స్కూటర్ ప్రత్యేకత. TVS SmartXonnectతో హై-రెసల్యూషన్ TFT క్లస్టర్ Alexa, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్, పార్క్ చేయబడిన స్థాన గుర్తింపు వంటి 50+ ఫీచర్లతో సమృద్ధి. కాల్, మెసేజ్, సోషల్ మీడియా అలర్ట్స్, 2 రైడ్ మోడ్‌లు, OTA అప్‌డేట్‌లు, కస్టమ్ విడ్జెట్‌లు, 4-వే నావిగేషన్ స్విచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
భద్రత, సౌకర్యం:
NTORQ 150 ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తూ, భద్రతా ప్రమాణాలను పెంచింది. క్రాష్, దొంగతనం హెచ్చరికలు, వార్నింగ్ లైట్స్, అత్యవసర బ్రేక్ హెచ్చరికలు ఉన్నాయి. ఫాలో-మీ హెడ్‌ల్యాంప్‌లు, టెలిస్కోపిక్ సస్పెన్షన్, సర్దుబాటు చేయగల బ్రేక్ లివర్‌లు భద్రతను మరింత మెరుగుపరుస్తాయి. EZ సెంటర్ స్టాండ్, 22 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు రైడింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. మార్కెట్ పోటీ: భారతీయ స్కూటర్ మార్కెట్లో TVS NTORQ 150 యమహా Aerox 155, హీరో Zoom 160 వంటి హైపర్ స్కూటర్‌లతో పోటీ పడుతుంది.