
Electric scooter : టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో 158 కిమీ రేంజ్, ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ ఆటో మొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో కొత్త మోడల్ ను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ పేరు టీవీఎస్ ఆర్బిటర్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,900 గా లభిస్తోంది. దీని రూపకల్పనలో కొద్దిగా టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఫీచర్స్ పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యాధునిక, వినియోగదారులకు అనుకూలంగా రూపొందించబడింది. క్రింద ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం.
డిజైన్
టీవీఎస్ ఆర్బిటర్ డిజైన్ విశేషాలు
డిజైన్ పరంగా, టీవీఎస్ ఆర్బిటర్ కొంచెం ఫంకీగా కనిపించినప్పటికీ, ఆధునికతని పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. అందులోని ఆకర్షణీయ రంగులు ప్రత్యేకతనిచ్చేలా ఉంటాయి.డిజైన్ మొత్తం పర్పస్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా ఉంది. సీటు పొడవు: 845 మిమీ ఫ్లోర్‌బోర్డ్ పొడవు: 290 మిమీ, విశాలంగా ఉంది హ్యాండిల్‌బార్: రైడర్ సౌకర్యం కోసం నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఈ అఫార్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద 34 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీగా ఉంది. టీవీఎస్ ఈ స్కూటర్‌లో ముందు వైపు 14-ఇంచ్ అల్లాయ్ వీల్, వెనుక 12-ఇంచ్ వీల్, ఇందులో వెనుక వీల్‌లోనే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
బ్యాటరీ
బ్యాటరీ సామర్థ్యం & రేంజ్
టీవీఎస్ ఆర్బిటర్ 3.1 kWh బ్యాటరీ ప్యాక్ తో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేయగానే 158 కిమీ ఐడీసీ-క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో పాటు రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్లు,ఛార్జింగ్ సమయాల వివరాలు ఇంకా లభ్యం కాలేదు, త్వరలో అందుబాటులోకి వస్తాయి.
ఫీచర్స్
టీవీఎస్ ఆర్బిటర్ ఫీచర్స్
ఈ స్కూటర్ ఫీచర్స్ పరంగా చాలా అత్యాధునికంగా, వినియోగదారుకు సౌకర్యవంతంగా ఉంది: ఆల్-ఎల్ఈడీ లైటింగ్ మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ చిన్న వస్తువుల కోసం క్యాబీన్ స్పేస్ OTA అప్‌డేట్స్ బ్లూటూత్ కనెక్టివిటీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ ఆగడం (స్కూటర్ పడితే ప్రమాద నివారణ) కలర్ ఆప్షన్స్ టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్ అందుబాటులో 6 రంగుల్లో లభిస్తుంది: నియాన్ సన్‌బరస్ట్ ,స్ట్రాటోస్ బ్లూ,లూనార్ గ్రే,స్టెల్లార్ సిల్వర్,కాస్మిక్ టైటానియం, మార్టియన్ కాపర్