TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ముందంజ.. జూపిటర్ 125 ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ స్కూటర్‌ను 'భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025'లో ఆవిష్కరించింది.
జూపిటర్ 125 సీఎన్‌జీ పేరుతో ఈ స్కూటర్‌ను టీవీఎస్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా స్కూటర్‌లోని కీలక ఫీచర్లను వివరించింది. 1) ఇంజిన్
124.8cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ బై-ఫ్యూయల్ ఇంజిన్ ఉండే ఈ స్కూటర్ 7.2 హార్స్ పవర్ మరియు 9.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2. గేర్‌బాక్స్
సీవీటీ ఆటోమేటెడ్ గేర్‌బాక్స్‌తో టాప్ స్పీడ్ గంటకు 80.5 కిలోమీటర్లు.
Details
3. ఇంధన సామర్థ్యం
స్కూటర్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్‌జీ సిలిండర్ ఉంటుంది.
4. రేంజ్ సీఎన్‌జీ, పెట్రోల్ కంబైన్డ్ రేంజ్ 226 కిలోమీటర్లుగా ఉంటుంది.
5. డిజైన్
మెటల్ మాక్స్ బాడీతో రూపొందించబడిన ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్‌జీతో పాటు, ఇథనాల్‌తో నడిచే రైడర్ 125, ఐక్యూబ్ విజన్ కాన్సెప్ట్ స్కూటీ, అపాచీ ఆర్‌టీఎస్ఎక్స్‌ను కూడా టీవీఎస్ ఆవిష్కరించింది.
Details
ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం
ఇంతకు ముందు బజాజ్ తన 'ఫ్రీడమ్ 125' పేరుతో తొలి సీఎన్‌జీ బైక్‌ను లాంచ్ చేసి ఇంధన ప్రత్యామ్నాయాల్లో ముందడుగు వేసింది.
అయితే ఇప్పటివరకు సీఎన్‌జీతో నడిచే స్కూటర్ మార్కెట్‌లోకి రాలేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్‌జీ ద్వారా ఆ ఘనతను సొంతం చేసుకోనుంది.
ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయడం ఎప్పుడనేది టీవీఎస్ వెల్లడించలేదు.
అయితే ఈ ఏడాది చివరినాటికి ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.