Page Loader
టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?
టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?

టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2023
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటర్ ఇటీవలే లాంచ్ చేసింది. క్రియాన్ స్కూటర్ ఆధారంగా రూపొందించిన ఈ ఈవీకి మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ ఈవీ ఏథర్ 450 ఎక్స్ కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండింట్లో ఏదీ బెటర్ అన్నది? ఇప్పుడు తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్‌లో కార్నరింగ్ లైట్స్ విత్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, షార్ప్ లుకింగ్ సైడ్ ప్యానెల్స్, టీఎఫ్‌టీ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ లు లభించనున్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్​ వాహనాలు స్మార్ట్​​ఫోన్​ కనెక్టివిటీ, ఇన్​-బిల్ట్​ నేవిగేషన్ తో రానున్నాయి.

Details

టీవీఎస్ ఎక్స్ ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 140 కిలోమీటర్ల ప్రయాణం

ఏథర్ 450 ఎక్స్ లో ఎల్ఈడీ హెడ్ లైట్, యాంగ్యులర్ బాడీ ప్యానెల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్, ప్లష్ ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, 7.0 ఇంచ్ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ వంటివి రానున్నాయి. ఇక టీవీఎస్​ ఎక్స్​లో 3.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో కూడిన 11కేడబ్ల్యూ మిడ్​ మౌంటెడ్​ మోటర్​ వస్తోంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 140కి.మీల ప్రయాణించగలదని సంస్థ స్పష్టం చేసింది. దీని టాప్​ స్పీడ్​ 105కేఎంపీహెచ్​ గా ఉంది. ఇండియాలో ఏథర్​ 450ఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.45లక్షలు ఉండగా, ఇక క్రియాన్​ ఆధారిత టీవీఎస్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉంది.