మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
లగ్జరీ కార్లను తయారు చేసే జర్మన్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ నూతనంగా మరో రెండు కార్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. మెర్సిడెస్-బెంజ్ 2024 AMG GLC43, 2025 AMG GLC63 S E కార్లను వచ్చే ఏడాది యూఎస్ లో విక్రయించనున్నారు. ఇప్పటికే ఈ కార్లకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. Mercedes-AMG GLC43, GLC63 S Eలో మస్క్యులర్ బానెట్, వర్టికల్ స్లాట్‌లతో కూడిన విస్తృత గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, స్వెప్ట్-బ్యాక్ హెడ్‌లైట్‌లను కలిగి ఉన్నాయి. డోర్-మౌంటెడ్ ORVMలు, 20-అంగుళాల వీల్స్‌తో రానున్నాయి. ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, స్పాయిలర్, డిఫ్యూజర్ అందుబాటులో ఉన్నాయి.
Mercedes-AMG GLC43 ధర రూ. 49.2 లక్షలు
Mercedes-AMG GLC43లో మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌పై నడవనుంది. ఇందులో 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, నాలుగు-సిలిండర్ ఇంజన్ 416hp/500.3Nm శక్తిని అందించనుంది. అదే సమయంలో, GLC63 S Eలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్, 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ (469hp/545Nm), ఎలక్ట్రిక్ మోటార్, 6.1kWh బ్యాటరీ ఉన్నాయి. ఈ రెండు కార్లలో విలాసవంతమైన క్యాబిన్లు, ప్రయాణికుల భద్రత కోసం బహుళ ఎయిర్‌బ్యాగ్‌లున్నాయి. అదే విధంగా పెడల్స్, ఫ్లోర్ మ్యాట్‌లు, డోర్ సిల్స్‌పై AMG బ్రాండింగ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి Mercedes-AMG GLC43 ధర రూ. 49.2 లక్షలు ఉండగా.. GLC63 S E ధర రూ. 65.6 లక్షలు ఉండనుంది.