
అల్ట్రావైలెట్ ఎఫ్-77 మోడల్ గ్రాండ్ రిలీజ్.. రేపట్నుంచి బుకింగ్స్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావైలెట్ నుంచి సోమవారం ఖరీదైన బైక్(EV) లాంచ్ అయ్యింది.ఈ మేరకు (ఎక్స్ షోరూమ్) ధర రూ.5.60 లక్షల భారీ ధరను కంపెనీ నిర్ణయించింది.
చంద్రయాన్-3 స్ఫూర్తితోనే ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారీ చేసినట్లు ప్రకటించింది.ఈ కొత్త మోడల్ బైక్ కు ఎఫ్77గా కంపెనీ పేరు పెట్టింది.
అంతరిక్ష రంగంలో భారత్ విశేష కృషిని, అమోఘ సాంకేతిక పురోగతి నేపథ్యంలో తాజాగా చంద్రయాన్-3 మిషన్ లాంచ్ చేసిందని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే స్ఫూర్తి పొంది ఎఫ్77 మోడల్ ను ఆటోమోబైల్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.
కేవలం 10 వాహనాలకే(లిమిటెడ్ ఎడిషన్) పరిమితి విధించామని తెలిపింది. మంగళవారం సాయంత్రం బుకింగ్స్ ప్రారంభమవుతాయని కంపెనీ వివరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎఫ్-77 మోడల్ ను విడుదల చేసిన అల్ట్రావైలెట్
Launch Alert!
— Ultraviolette (@UltravioletteEV) August 21, 2023
Tune in at 3PM today - We've got something out of the world.
Ultraviolette's Tribute to India’s Space Odyssey#ultraviolette #spacebound #makeinindiahttps://t.co/jGKmNVeMdh