Page Loader
Chandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో 
చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో

Chandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాబిల్లి పై ల్యాండర్‌ 'విక్రమ్‌'.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం కోసం విక్రమ్ ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం కీలక ప్రక్రియ చేపట్టారు. చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా జాబిల్లి పైకి పంపించిన ఆర్బిటర్‌ ప్రస్తుతానికి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్ 

Details 

రెండింటి మధ్య టూ-వే కమ్యూనికేషన్ ఏర్పాటు

'వెల్కమ్ ..బడ్డీ ! అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్.. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మాడ్యుల్‌ను అధికారికంగా స్వాగతించింది. ఈ రెండింటి మధ్య టూ-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయబడింది. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రాని(MOX ISTRAC)కి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి' అంటూ ఇస్రో పేర్కొంది. మరోవైపు.. సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలు మోపుతుందని ఇస్రో వెల్లడించింది.