
Car launches: మే నెలలో కార్లకు సంబంధించిన కీలక అప్డేట్ల వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
మే నెలలో ఆటో మొబైల్ రంగం మరింత ఉత్సాహభరితంగా మారబోతోంది.
ఏప్రిల్ నెలలో కొత్తగా ఏ కీలక అప్‌డేట్‌లు లేని కారణంగా మార్కెట్‌లో ప్రశాంతత నెలకొంది.
అయితే ఈ నెలలో మాత్రం వివిధ కార్లకు సంబంధించిన ఉత్సాహభరితమైన నవీకరణలు, లాంచ్‌లు జరగనున్నాయి.
వాహన ప్రేమికులకు ఆనందాన్నిచ్చే ఈ తాజా అప్‌డేట్లు ఈ విధంగా ఉన్నాయి:
వివరాలు
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్‌కు ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయిన టాటా ఆల్ట్రోజ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
బాహ్య రూపం పరంగా చిన్నపాటి మార్పులు మాత్రమే ఉంటాయని భావించబడుతోంది. ముఖ్యంగా బంపర్లు, అలాయ్ వీల్స్ లాంటి అంశాల్లో.
అయితే ఇంటీరియర్ డిజైన్‌లో మాత్రం ముఖ్యమైన మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కారు పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ వేరియంట్‌లలో లభించనుంది. మే 21న ఈ కొత్త మోడల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
వివరాలు
కరెన్స్ మోడల్.. క్లావిస్‌గా
కియా సంస్థ తమ కరెన్స్ ఎంఫీవీకి ఫేస్‌లిఫ్ట్ రూపాన్ని ఇచ్చి 'క్లావిస్' పేరుతో మే 8న ఆన్‌లైన్ ద్వారా ప్రదర్శించనుంది.
దీని ధర వివరాలను జూన్ 2న వెల్లడించనున్నారు. ఈ కొత్త మోడల్ 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కలిగి ఉంటుంది.
దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉండనుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభ్యం కానుంది.
వివరాలు
విండ్‌సోర్ అధిక రేంజ్‌తో..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ సంస్థ తమ విండ్‌సోర్ ఈవీకి పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ను జోడించనుంది.
ప్రస్తుతం ఇది 38kWh సామర్థ్యంతో లభిస్తుండగా, త్వరలో 50.6kWh సామర్థ్యాన్ని కలిగిన కొత్త వెర్షన్ మార్కెట్లోకి రానుంది.
దీంతో వాహనం రేంజ్ మరింతగా పెరగనుంది. ఎంజీకి మాతృ సంస్థ అయిన సియాక్‌కు వులింగ్ క్లౌడ్ ఈవీకి అనుగుణంగా ఈ బిగ్ బ్యాటరీ వేరియంట్ రూపొందించబడుతోంది.
మే నెలలో ఈ వాహనం లాంచ్ కావచ్చని తెలుస్తున్నప్పటికీ, ఖచ్చితమైన తేదీని సంస్థ వెల్లడించలేదు.
వివరాలు
ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వారి గోల్ఫ్ జీటీఐ మోడల్‌ను భారత మార్కెట్‌లో మే నెలలో ప్రవేశపెట్టనుంది.
పోలో జీటీఐ తర్వాత 'జీటీఐ' బ్యాడ్జ్‌తో రాబోతున్న రెండవ మోడల్ ఇది. దీన్ని నేరుగా దిగుమతి చేసి దేశీయంగా విక్రయించనున్నారు.
ఈ వాహనం 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 261 బీహెచ్‌పీ పవర్‌ను, 370 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
అంతేకాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కార్ బ్రాండ్ల నుంచి కూడా కొత్త అప్‌డేట్లు వచ్చే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.