Page Loader
భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు
మహీంద్రా XUV400 ధరను ఇంకా వెల్లడించని మహీంద్రా సంస్థ

భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 02, 2023
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం. మారుతీ సుజుకి Jimny: మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతుందని అంచనా వేస్తున్నారు. 5-డోర్ వెర్షన్‌ కాబట్టి ఓవర్సీస్‌లో విక్రయించే వెర్షన్‌తో పోలిస్తే కారు ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. మహీంద్రా XUV400 EV: మహీంద్రా EV మార్కెట్లో ఇప్పటికే తన సత్తా చూపిస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ ఇటీవలే మహీంద్రా XUV400ని ఆవిష్కరించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కారు 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 456 కిమీల పరిధి వరకు నడుస్తుంది.

కార్

త్వరలో మార్కెట్ లోకి అందరూ ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ 5-డోర్

మహీంద్రా థార్ 5-డోర్: భారతదేశంలో ఎక్కువమంది ఆతృతగా ఎదురుచూస్తున్న SUV మోడల్ జనవరి 26న విడుదల చేయనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. సిట్రోయెన్ C3 EV: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ C3 EVతో భారతీయ EV మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇది 50kWh బ్యాటరీ ప్యాక్ తో 300-కిలోమీటర్ల పరిధి వరకు నడుస్తుంది. BMW 7-సిరీస్, BMW i7: అత్యంత సంపన్నమైన వాహనం, 7-సిరీస్ సెడాన్ తో, BMW గణనీయంగా అభివృద్ధి చెందింది. Mercedes-Benz S-Class, Audi A8L వంటి మోడళ్లకు పోటీగా విలాసవంతమైన, సాంకేతికంగా అధునాతన వాహనాన్ని రూపొందించింది.101.7kWh బ్యాటరీ ఉన్న BMW i7 ఒక ఛార్జ్‌పై 590-625 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.