
VLF Mobster Sporty: రేపే ఇండియాలో VLF Mobster లాంచ్.. స్ట్రీట్‌ఫైటర్ డిజైన్, లైవ్ డ్యాష్‌క్యామ్!
ఈ వార్తాకథనం ఏంటి
మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ధీటుగా పెరుగుతున్న స్పోర్టీ స్కూటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మోటోహాస్ (Motohaus) సంస్థ రేపు, అంటే సెప్టెంబర్ 25, 2025 భారతదేశంలో కొత్త VLF Mobster స్కూటర్ను లాంచ్ చేయనుంది. వీఎల్‌ఎఫ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ 'టెన్నిస్' తరువాత ఇది తొలి పెట్రోల్ స్కూటర్‌గా రాబోతుంది. భారతదేశంలోనే ఉత్పత్తి మోటోహాస్ అనేది ఇటాలియన్ వీఎల్‌ఎఫ్, భారతీయ కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ (KVM) భాగస్వామ్యం. కొత్త Mobster స్కూటర్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని KVM ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు.
Details
డిజైన్, స్టైలింగ్
Mobster స్కూటర్‌ను ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ అలెషాండ్రో టార్టారిని రూపొందించారు. స్కూటర్ డిజైన్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిళ్లను పోలి ఉంటుంది. ముందు భాగంలో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, DRLs, ఎత్తైన ఫ్లైస్క్రీన్, బయట కనిపించే హ్యాండిల్‌బార్ ఉన్నాయి. సైడ్ ప్యానెల్స్ షార్ప్ డిజైన్‌తో, సీటు కాంపాక్ట్‌గా ఉంటుంది. అందుబాటులో ఉండే రంగులు ఎరుపు, బూడిద. ముందు వైపు 120-సెక్షన్ టైర్, వెనుక వైపు 130-సెక్షన్ టైర్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
Details
ప్రధాన ఫీచర్లు
Mobster స్కూటర్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి 5-అంగుళాల TFT డిస్‌ప్లే స్క్రీన్ మిర్రరింగ్ USB ఛార్జింగ్ పోర్ట్ డ్యూయల్-ఛానల్ ABS లైవ్ డ్యాష్‌క్యామ్ ఫీచర్ (భారతంలో ఈ ఫీచర్ కలిగిన తొలి స్కూటర్లలో ఒకటి) ఇంజిన్, స్పెసిఫికేషన్స్ అంతర్జాతీయ మార్కెట్లో Mobster స్కూటర్ 125 సీసీ లేదా 180 సీసీ ఇంజిన్ ఆప్షన్స్ లో లభిస్తుంది 125 సీసీ: 12 BHP శక్తి, 11.7 Nm టార్క్ 180 సీసీ : 17.7 BHP శక్తి, 15.7 Nm టార్క్
Details
సస్పెన్షన్, బ్రేకింగ్
ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంటాయి. మార్కెట్ పోటీ ప్రస్తుతం దేశంలో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉంది. రాబోయే VLF Mobster స్కూటర్ TVS N-Torque, Hero Zoom 160, Aprilia SR 175 వంటి మోడళ్లకు గట్టి పోటీగా మారనుంది అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.