LOADING...
Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ ID పోలో EV.. లీక్ ఫీచర్లు, లాంచ్‌కు ముందు పూర్తి వివరాలివే!
వోక్స్‌వ్యాగన్ ID పోలో EV.. లీక్ ఫీచర్లు, లాంచ్‌కు ముందు పూర్తి వివరాలివే!

Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ ID పోలో EV.. లీక్ ఫీచర్లు, లాంచ్‌కు ముందు పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వోక్స్‌వ్యాగన్ పోలో తన క్రేజ్, పవర్, స్టేబిలిటీ, హ్యాండ్లింగ్ లో ప్రత్యేక గుర్తింపుతో కార్ లవర్స్‌‌ను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ EV వెర్షన్‌లో వస్తుంది. వోక్స్‌వ్యాగన్ ఐడీ పోలో EV (Volkswagen ID Polo EV) లాంచ్‌కు ముందే వైరల్ అవుతోంది. తాజా లీక్ ఫోటోలు ఈ కారు ఫీచర్స్, డిజైన్ గురించి పూర్తి అవగాహన ఇస్తున్నాయి. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోలో EV రాకతో, మార్కెట్‌లో లెక్కలు మారవచ్చని సూచిస్తున్నారు.

వివరాలు

ఫీచర్లు

2023 ఐడి.2ఎల్ కాన్సెప్ట్ ఆధారంగా ID పోలో రూపకల్పన చేయబడింది. 2025 మ్యూనిచ్ మోటర్ షోలో తొలిసారిగా ప్రదర్శన. లీక్ ఫోటోల ప్రకారం, స్లిమ్ LED హెడ్‌లైట్స్, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ (EV స్టైల్), లైటింగ్ లోగో (VW బ్యాడ్జ్), ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. బంపర్, మిర్రర్స్‌లో కొద్దిపాటి మార్పులు. క్యాబిన్‌లో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

వివరాలు

పెరిగిన సైజ్

పొడవు: 4,053 మిమీ, వెడల్పు: 1,816 మిమీ, ఎత్తు: 1,530 మిమీ, వీల్‌బేస్: 2,600 మిమీ. గత ICE పోలిస్తే కొలతలు పెరిగాయి; 2022లో సబ్-4 మీటర్ హ్యాచ్‌బ్యాక్. లీక్ ఫోటోల్లో ID పోలో GTI కూడా కనిపిస్తుంది: హనీ కోంబ్ ఫ్రంట్ గ్రిల్, టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎరుపు యాక్సెంట్ స్ట్రైప్, GTI బ్యాడ్జ్‌లు. డిజైన్, రేంజ్ MEB+ప్లాట్‌ఫారమ్‌పై ఫ్రంట్ వీల్ డ్రైవ్2 నిర్మాణం. 38kWh, 56kWhబ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు. 435 లీటర్ల బూట్ స్పేస్. ఒక్క ఛార్జ్‌లో గరిష్ట రేంజ్ 451 కి.మీ. ఈ అన్ని ఫీచర్లు, పెరిగిన కొలతలు, స్టైలిష్ డిజైన్, వృద్ధి చెందిన రేంజ్ వలన ID పోలో EV మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.

Advertisement