
New SUV : నూతన ఫీచర్లతో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-Line.. స్టైలిష్ SUVలో కొత్త ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది. బ్రాండ్ ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.
టిగువాన్ ఆర్-లైన్ సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, రంగుల ఎంపికల గురించి వివరంగా చూద్దాం.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఫీచర్లు
ఎల్‌ఈడీ లైటింగ్: టిగువాన్ ఆర్-లైన్ ఎల్‌ఈడీ ప్లస్ హెడ్‌ల్యాంప్స్, యానిమేటెడ్ 3డీ ఎల్‌ఈడీ రేర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో వస్తుంది.
క్లైమేట్ కంట్రోల్ : త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆంతరంగిక వాతావరణం అదుపులో ఉంటుంది.
పార్కింగ్ అసిస్ట్ : పార్క్ అసిస్ట్ ప్లస్ ద్వారా కారు పార్కింగ్‌ను సులభతరం చేయొచ్చు.
Details
అత్యాధునిక ఫీచర్లు
వైర్‌లెస్ ఛార్జింగ్ : రెండు వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.
యాంబియెంట్ లైటింగ్ : 30 రంగుల యాంబియెంట్ లైటింగ్‌తో ఇంటీరియర్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
ప్రీమియం సీటింగ్ : ఆర్ బ్యాడ్జింగ్‌తో కూడిన ప్రత్యేక సీట్లు అందిస్తారు.
అల్లాయ్ వీల్స్ : డైమండ్ కట్ ఫినిషింగ్‌తో కూడిన 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటాయి.
సన్‌రూఫ్ : క్యాబిన్‌లో ప్రకృతి కాంతిని అందించేందుకు పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది.
ఇల్యూమినేటెడ్ డీటైల్స్ : హెడ్‌ల్యాంప్స్, రేర్ లైటింగ్, డోర్ హ్యాండిల్స్, వెల్కమ్ లైట్‌తో సరౌండ్ లైటింగ్, క్రోమ్, సిల్వర్-అనోడైజ్డ్ రూఫ్ రైల్స్, ఎయిర్ ఇన్‌టేకింగ్ డిజైన్ హైలైట్స్‌గా ఉంటాయి.
Details
ఆరు రంగుల్లో వోక్స్‌వ్యాగన్
1. పెర్సిమోన్ రెడ్ మెటాలిక్
2. నైట్ షేడ్ బ్లూ మెటాలిక్
3. గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్
4. ఓరిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్
5. సిప్రెసినో గ్రీన్ మెటాలిక్
6. ఓస్టెర్ సిల్వర్ మెటాలిక్
Details
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ స్పెసిఫికేషన్లు
ఇంజిన్ : 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.
పవర్ : 201 బీహెచ్‌పీ. - టార్క్: 320 ఎన్ఎమ్.
ట్రాన్స్‌మిషన్ : 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గియర్‌బాక్స్.
డ్రైవ్ సిస్టమ్ : 4 మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD).
0-100 కి.మీ/గంట వేగాన్ని 7.1 సెకన్లలో చేరగలదు.
ఈ లగ్జరీ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్, ఇసుజు ఎంయూ-ఎక్స్ వంటి టఫ్ ఎస్‌యూవీలతో పాటు ఆడీ క్యూ3, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ వంటి ప్రీమియం కార్లతో పోటీ పడనుంది.