వోల్వో EX30 v/s టెస్లా మోడల్ Y.. ధర, ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే!
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30 ఈవీ కారు ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగా ఇది సేఫ్టీ కారు అని సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. యూఎస్‌లో $34,950 డాలర్లు (సుమారు రూ. 28.62 లక్షలు) ఉంది. అదే విధంగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ కారుగా టెస్లా మోడల్ Y రికార్డు సాధించింది. ఈ మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి అల్-ఎలక్ట్రిక్ వెహికల్‌గా చరిత్ర సృష్టించనుంది. అయితే వోల్వో EX30, టెస్లా మోడల్ కు గట్టి పోటిని ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ రెండు వెహికల్స్‌లో ఫీచర్లు, భద్రత విషయంలో ఏదీ బెస్ట్ కారో తెలుసుకుందాం.
వోల్వో EX30
వోల్వో EX30లో మస్కులర్ బానెట్, క్లోజ్డ్ఆఫ్‌గ్రిల్, LED హెడ్‌లైట్లు, బ్లాక్ క్లాడింగ్‌తో కూడిన ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, 18/19-అంగుళాల డిజైనర్ వీల్స్, వెనుకవైపు 'VOLVO' అక్షరాలు, టెయిల్‌ల్యాంప్‌లున్నాయి. టెస్లా మోడల్ Yలో హుడ్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన స్వెప్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, కూపే-వంటి స్లోపింగ్ రూఫ్‌లైన్, ORVMలు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్-లైన్డ్ విండోస్, డిజైనర్ అల్లాయ్‌వీల్స్ ఉన్నాయి. వోల్వో EX30 ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది. టెస్లా మోడల్ Y ఐదు/ఏడు-సీట్ల క్యాబిన్ ఉంది. వోల్వో EX30 28.62 లక్షలు ఉండగా.. టెస్లా మోడల్ Y రూ. 32.96 లక్షలు ఉంది. అయితే Y మోడల్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం-లుకింగ్ క్యాబిన్, పొడవైన డ్రైవింగ్ రేంజ్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు.