Amazon: భారత్‌లో 1,000 ఎలక్ట్రిక్ ట్రక్కులు ప్రవేశపెట్టనున్న అమెజాన్.. కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా తన క్విక్ కామర్స్ సేవలను మరింత వేగంగా విస్తరించేందుకు అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా VE కమర్షియల్ వెహికల్స్ (VECV)తో కలిసి సుమారు 1,000 ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించిన ఐషర్ ప్రో-ఎక్స్ ఎలక్ట్రిక్ ట్రక్కులను నగరాల లోపలి లాజిస్టిక్స్ కార్యకలాపాలకు వినియోగించనుంది. నగర శివార్లలో ఉన్న పెద్ద ఫుల్‌ఫిల్మెంట్ హబ్‌ల నుంచి వినియోగదారులకు సమీపంలోని మైక్రో ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లకు సరుకులను ఈ వాహనాల ద్వారా తరలించనున్నారు.
వివరాలు
1,000కుపైగా మైక్రో ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు
అమెజాన్ తన అల్ట్రా ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ నౌ' సేవలను వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 100 నగరాలకు ఈ సేవలను విస్తరించడంతో పాటు 1,000కుపైగా మైక్రో ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో, కొచ్చి, మంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో సేవలను విస్తరించనుంది.
వివరాలు
అమెజాన్‌తో కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి
అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పటికే 12 వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు తమ సేవల్లో ఉన్నాయని తెలిపారు. లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ వినియోగాన్ని మరింత పెంచుతున్నామని చెప్పారు. ఇక ఐషర్ ప్రో-ఎక్స్ ట్రక్కులను ఈ-కామర్స్, క్విక్ కామర్స్ అవసరాలకు అనుగుణంగా అమెజాన్‌తో కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు VECV వెల్లడించింది. భారత లాజిస్టిక్స్ అవసరాలకు సరిపోయే ఎలక్ట్రిక్ ట్రక్ సొల్యూషన్స్‌పై 2022 నుంచే రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.