LOADING...
Tesla Model Y: ధర ఎక్కువైనా… భారత్‌కు టెస్లా మోడల్ వై ఎందుకు సరైన ఎంపిక?
ధర ఎక్కువైనా… భారత్‌కు టెస్లా మోడల్ వై ఎందుకు సరైన ఎంపిక?

Tesla Model Y: ధర ఎక్కువైనా… భారత్‌కు టెస్లా మోడల్ వై ఎందుకు సరైన ఎంపిక?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో టెస్లా ఎంట్రీ గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల ప్రేమికులకు,టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం. ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు బెస్ట్ సెల్లర్‌గా ఉన్న మోడల్ వై ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి వచ్చింది. అయితే దీని ధర మాత్రం చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌కు ఎక్స్‌షోరూమ్ ధర రూ.59.89 లక్షల నుంచి ప్రారంభం కాగా, లాంగ్ రేంజ్ RWD ధర రూ.67.89 లక్షలు. దీనికి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సౌకర్యం జోడిస్తే మరో రూ.6 లక్షలు అదనం. మహీంద్రా, టాటా, కియా లాంటి కంపెనీలు దేశీయంగా బలమైన ఈవీలను తీసుకొస్తున్న సమయంలో, పాశ్చాత్య దేశాల్లో సాధారణంగా కనిపించే మోడల్ వై ధర సామాన్యుడికి కాస్త భారమే.

వివరాలు 

టెస్లా కేవలం కారు తయారీ సంస్థ కాదు…

అయితే, ఇంత ధర ఉన్నప్పటికీ ఈ కారు భారత్‌కు ఎందుకు సరిపోతుందో ఇప్పుడు చూద్దాం. కార్లు తయారు చేసే ఒక టెక్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల నిర్వచనాన్నే టెస్లా మార్చేసింది. వేగం, సామర్థ్యం, అత్యాధునిక టెక్నాలజీ అన్నీ కలిసిన వాహనంగా మోడల్ వై భారత్‌లోకి వచ్చింది. 15.4 అంగుళాల భారీ టచ్ స్క్రీన్‌తో కూడిన మినిమలిస్ట్ ఇంటీరియర్, డాగ్ మోడ్, క్యాంప్ మోడ్, బయోవెపన్ డిఫెన్స్ మోడ్ లాంటి ఫీచర్లు దీన్ని సాధారణ కారుగా కాకుండా 'చక్రాలపై ఉన్న గ్యాడ్జెట్'లా మారుస్తాయి. కొత్తదనం, ప్రత్యేకతను ఇష్టపడే భారత వినియోగదారులకు టెస్లా ఒక స్టేటస్ సింబల్‌లా ఉంటుంది.

వివరాలు 

పెట్రోల్ లగ్జరీ ఎస్యూవీలకు గట్టి పోటీ

పనితీరు విషయానికి వస్తే, బేస్ మోడల్ వై RWD కూడా పెట్రోల్ లగ్జరీ ఎస్యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎలక్ట్రిక్ టార్క్ వెంటనే స్పందించడం వల్ల డ్రైవింగ్ అనుభవం స్మూత్‌గా, అదే సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ ఈ టైమ్‌ను 5.6 సెకన్లకు తగ్గిస్తుంది. త్వరలో రానున్న పెర్ఫార్మెన్స్ AWD వేరియంట్ అయితే 3 సెకన్లలోపే ఈ స్పీడ్‌ను చేరుకుంటుందని అంచనా. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇన్‌స్టంట్ టార్క్ చాలా ఉపయోగపడుతుంది.

Advertisement

వివరాలు 

భారత్‌లో ఈవీ కొనుగోలుదారులకి ప్రధాన భయం రేంజ్

భారత్‌లో ఈవీ కొనుగోలుదారులకి ప్రధాన భయం రేంజ్. దీనికి టెస్లా గట్టి సమాధానం ఇస్తోంది. లాంగ్ రేంజ్ మోడల్ వై ఒకసారి ఛార్జ్ చేస్తే 660 కిలోమీటర్లకు పైగా (WLTP) ప్రయాణిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమం.సాధారణ RWD వేరియంట్ కూడా రోజువారీ ప్రయాణాలకు, వీకెండ్ ట్రిప్‌లకు సరిపడే రేంజ్ ఇస్తుంది. సూపర్‌చార్జింగ్‌తో కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 267 కిలోమీటర్ల రేంజ్ చేర్చుకోవచ్చు. భద్రత విషయంలో టెస్లా ఎలాంటి రాజీ పడదు. మోడల్ వైకి యూరో ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. బలమైన నిర్మాణం, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, అనేక ఎయిర్‌బ్యాగ్స్ దీనికి కారణం.

Advertisement

వివరాలు 

సాధారణ కార్లల కాదు టెస్లా 

లేన్ కీప్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ మానిటరింగ్ వంటి లెవల్-2 ADAS ఫీచర్లు ప్రతి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఇటీవలి కాలంలో భద్రతపై చర్చ ఎక్కువైన నేపథ్యంలో టెస్లా ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. సాధారణ కార్లు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పాతబడతాయి. కానీ టెస్లా అలా కాదు. ఓవర్ ద ఎయిర్ (OTA) అప్‌డేట్స్ ద్వారా కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, అదనపు భద్రత కాలక్రమేణా కారుకే చేరుతాయి. సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కారు 'స్మార్ట్' అవుతుంది. ఇది నిజంగా చక్రాలపై ఉన్న స్మార్ట్‌ఫోన్ లాంటిదే.

వివరాలు 

ఈవీలకే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు

ఓనర్‌షిప్ అనుభవం విషయానికి వస్తే, ఈవీలకే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. టెస్లాలో మూవింగ్ పార్ట్స్ తక్కువగా ఉండటం వల్ల బ్రేక్‌డౌన్ అవకాశాలు కూడా తగ్గుతాయి. రిమోట్ డయాగ్నస్టిక్స్, యాప్ ఆధారిత కంట్రోల్స్ వల్ల యూజర్ అనుభవం మరింత సులభం. టెస్లా యాప్ ద్వారా కెమెరాలను రిమోట్‌గా చూడటం, యువ డ్రైవర్లకు స్పీడ్ లిమిట్ సెట్ చేయడం, కారులోకి ఎక్కే ముందు క్యాబిన్‌ను కూల్ లేదా వార్మ్ చేయడం కూడా చేయవచ్చు. టెస్లాలో ఉన్న కొన్ని ప్రత్యేక ఫీచర్లు జీవనశైలికే విలువ పెంచుతాయి. డాగ్ మోడ్ వల్ల మీ పెంపుడు జంతువు కారులో సౌకర్యంగా ఉంటుంది. క్యాంప్ మోడ్‌తో రాత్రిపూట కారే ఒక చిన్న బెడ్‌రూమ్‌లా మారుతుంది.

వివరాలు 

భారత్‌లో మొదటగా మెట్రో నగరాలపైనే టెస్లా దృష్టి

బయోవెపన్ డిఫెన్స్ మోడ్ అయితే నగర కాలుష్యానికి ఎదురుగ నిలుస్తుంది. ఇవన్నీ గిమ్మిక్స్ కాదు... నగర జీవనానికి ఉపయోగపడే అప్‌గ్రేడ్స్. భారత్‌లో మొదటగా మెట్రో నగరాలపైనే టెస్లా దృష్టి పెట్టింది. కారణం స్పష్టమే. ప్రధాన నగరాల బయట ఇంకా ఛార్జింగ్ మౌలిక వసతులు పూర్తిగా అభివృద్ధి కాలేదు. అందుకే ఢిల్లీ, ముంబై,బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లో ముందుగా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇక్కడ ప్రీమియం ఈవీలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ధర విషయానికి వస్తే రూ.60 నుంచి 68 లక్షలు ఖరీదే. కానీ అందులో మీరు పొందేది ఏమిటంటే... ప్రపంచ స్థాయి టెక్నాలజీ, బెస్ట్ ఇన్ క్లాస్ రేంజ్, భవిష్యత్తుకి సరిపోయే OTA అప్‌డేట్స్, కొత్తదనానికి పర్యాయపదమైన బ్రాండ్ విలువ.

వివరాలు 

టెస్లా కొనడం అంటే 2007లో మొదటి ఐఫోన్ కొనడంలాంటిదే

ఇదే ధరలో ఉన్న లగ్జరీ పెట్రోల్ ఎస్యూవీలతో పోలిస్తే,టెస్లా టెక్ ఎకోసిస్టమ్‌ను,జీరో ఎమిషన్ ప్రయోజనాలను ఏదీ అందించలేను. భారత్‌లో ఇప్పుడే టెస్లా కొనడం అంటే 2007లో మొదటి ఐఫోన్ కొనడంలాంటిదే. ఇది కేవలం ఒక ఉత్పత్తి కాదు... భవిష్యత్తును ముందే స్వీకరించిన అనుభవం. ఛార్జింగ్ మౌలిక వసతులు విస్తరిస్తే,ఈవీ వినియోగం పెరిగితే, తొలితరం కొనుగోలుదారులకే ఎక్కువ లాభం.

వివరాలు 

డిప్రిసియేషన్ కూడా పెద్దగా ఉండదనే అంచనా

పైగా ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు ఉన్న రీసేల్ విలువను చూస్తే, దీని డిప్రిసియేషన్ కూడా పెద్దగా ఉండదనే అంచనా. మొత్తానికి టెస్లా మోడల్ వై అందరికీ కాదు... అది అవసరం కూడా లేదు. టెక్నాలజీ, సస్టైనబిలిటీ, ప్రత్యేకతకు విలువ ఇచ్చే నగర వినియోగదారుల కోసమే ఇది. కారు అనేది కేవలం ఒక యంత్రం కాదు... ఒక తెలివైన, కనెక్టెడ్ భాగస్వామిగా భావించే వారికి ఇది సరైన ఎంపిక. ధర ఎక్కువే, మౌలిక వసతులు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అయినా, రాబోయే మొబిలిటీ భవిష్యత్తును ఇప్పుడే స్వీకరించాలనుకుంటే టెస్లా మోడల్ వై పూర్తిగా అర్థవంతమైన ఎంపికే.

Advertisement