MG Windsor EV: విండ్సార్ ఈవీ ధర పెంపుతో పాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం నిలిపివేత!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, తన ప్రాచుర్యం పొందిన విద్యుత్ కారు విండ్సార్ EV ధరలను రూ.50,000 పెంచినట్లు ప్రకటించింది.
ఈ పెంపు అన్ని వేరియంట్లపై వర్తిస్తుంది. అదనంగా ఈ కంపెనీ విండ్సార్ EV కొనుగోలు చేసిన వినియోగదారులకు అందిస్తున్న ఉచిత ఛార్జింగ్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
విండ్సార్ EV ప్రారంభ ధరను పాపులర్ చేయడానికి కంపెనీ మొదట 10,000 యూనిట్ల వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే ధర నిర్ణయించింది.
2024 డిసెంబర్ నాటికి విండ్సార్ EV విక్రయాలు 10,000 యూనిట్ల మైలురాయిని చేరడంతో ధరలు పెంచే నిర్ణయం తీసుకుంది.
Details
ఒక్కసారి ఛార్జింగ్ తో 331కిలోమీటర్లు
ఇక జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, వినియోగదారులకు గతంలో ఉచిత ఛార్జింగ్ సదుపాయం ఇచ్చిన ఎంజీ ఇ-హబ్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్లలో ఉచిత ఛార్జింగ్ ఇవ్వడం కూడా నిలిపివేయడం గమనార్హం.
ఈ కొత్త ధరల సవరణ తర్వాత, విండ్సార్ EV బేసిక్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.13.99 లక్షలకు చేరుకుంది. మిడ్ లెవల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు ఉంది.
విండ్సార్ EVలో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 134 బీహెచ్‌పీ శక్తిని, 200Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఒక్క ఛార్జింగ్‌తో సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లున్నాయి.