
Winfast Electric SUV: టెస్లాకు గట్టి పోటీగా విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.. బుకింగ్‌లకు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌కి జూలై 15వ తేదీ మరచిపోలేని రోజుగా నిలిచింది. అదే రోజున ప్రపంచ ప్రఖ్యాత ఈవీ దిగ్గజం టెస్లా ముంబైలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించగా, మరోవైపు వియత్నాం ఆధారిత ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో తన తొలి ఎస్‌యూవీలైన VF 6, VF 7 కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.
Details
ఆకట్టుకునే డిజైన్‌తో విన్‌ఫాస్ట్ ఎస్‌యూవీలు
విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి ప్రవేశించబోయే VF 6, VF 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించబడ్డాయి. VF 6 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండబోతోంది. ఇది 59.6 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండి, పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత సుమారు 440 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠ శక్తి 201 bhp, టార్క్ 310 Nmగా ఉంది. VF 6 మోడల్ ధర రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
Details
VF 7 - మధ్యతరహా ఈవీ విభాగంలో శక్తివంతమైన పోటీదారు
వినియోగదారులను మరింత ఆకట్టుకునే మోడల్ VF 7. ఇది 75.3 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది. VF 7 మోడల్ ధర రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న BYD Atto 3 వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
Details
దేశవ్యాప్తంగా విస్తృతమైన రిటైల్ ప్రణాళిక
విన్‌ఫాస్ట్ సంస్థ భారత్‌లో తన బలాన్ని పెంచే దిశగా 35 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 13 డీలర్ గ్రూపులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలిచరణగా దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 32 డీలర్‌షిప్‌లతో రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. తూత్తుకుడిలో ప్లాంట్.. ఆగస్టులో ప్రారంభం విన్‌ఫాస్ట్ తమ వాహనాలను అధికారికంగా విక్రయించడానికి ముందుగా తూత్తుకుడిలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ఆగస్టులో ప్రారంభించనుంది. ఈ ప్లాంట్ ప్రారంభం తర్వాత VF 6, VF 7 మోడళ్ల డెలివరీలు ప్రారంభమవుతాయి.
Details
రూ.21,000తో ప్రీ-బుకింగ్.. ఫుల్ రీఫండబుల్
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను వినియోగదారులు విన్‌ఫాస్ట్ అధికారిక వెబ్‌సైట్ (VinFastAuto.in) లేదా షోరూమ్‌లలో రూ.21,000 బుకింగ్‌తో రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా రీఫండబుల్ కావడం విశేషం. విన్‌ఫాస్ట్ రాకతో భారత్ ఈవీ మార్కెట్లో కొత్త పోటీ శకం విన్‌ఫాస్ట్ ఎంట్రీతో భారతదేశం ఈవీ రంగం మరింత పోటీతో రగిలిపోనుంది. వినియోగదారులకు మరింత శ్రేయస్కరమైన ఎంపికలు అందుబాటులోకి రానుండటంతో, ఇది దేశీయ ఈవీ విపణిలో కొత్త శకానికి శ్రీకారం చుడనుందని పరిశీలకులు భావిస్తున్నారు.