భారతదేశంలో విడుదలైన 2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2
ఈ వార్తాకథనం ఏంటి
2023 యమహా FZ-X, R15 V4, MT-15 V2 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి మరిన్నిఫీచర్స్ తో భారతదేశంలో ప్రారంభమైంది.
యమహా మోటార్ ఇండియా 2023 సంవత్సరానికి తన మోటార్‌సైకిల్ సిరీస్ ను అప్‌డేట్ చేసింది, మొత్తం యమహా మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)తో వస్తుంది, అయితే FZ-S, FZ-X, R15 మరియు MT 15 వంటి మోడళ్లకు ప్రత్యేకమైన అప్డేట్లు కూడా ఉన్నాయి.
2023 FZS-Fi V4 డీలక్స్ మోడల్ TCSతో పాటు LED ఫ్లాషర్‌లతో అప్‌డేట్ అయిన హెడ్‌లైట్ డిజైన్ తో వస్తుంది. FZS-Fi V4 డీలక్స్ వేరియంట్ ఇప్పుడు బ్లూటూత్ Y-కనెక్ట్ అప్లికేషన్ అప్డేట్ తో వస్తుంది.
బైక్
యమహా మోటార్‌సైకిళ్లలో ఇప్పుడు ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్స్ (OBD-II) సిస్టమ్‌ను అమర్చారు
FZS-FI V4 డీలక్స్, FZ-X మోడల్‌లు రెండూ సింగిల్-ఛానల్ ABSతో వెనుక డిస్క్ బ్రేక్, మల్టీ-ఫంక్షన్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, టైర్-హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, తక్కువ ఇంజిన్ గార్డ్‌తో వస్తున్నాయి.
ఈ బైక్స్149 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తున్నాయి. FZS-FI V4 డీలక్స్, FZ-X మోడల్‌లు కూడా ఇప్పుడు E20 ఇంధనానికి అనుకూలంగా ఉన్నాయి.
2023 చివరి నాటికి, దాని మోటార్‌సైకిల్ మోడల్‌లు E20 ఫ్యూయల్ కంప్లైంట్‌గా తయారవుతాయని కంపెనీ తెలిపింది. అన్ని యమహా మోటార్‌సైకిళ్లలో ఇప్పుడు ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్స్ (OBD-II) సిస్టమ్‌ను కూడా అమర్చారు.