NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / MG Windsor EV Booking : MG విండ్సర్ EVని బుకింగ్ ప్రారంభం.. ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్లు
    తదుపరి వార్తా కథనం
    MG Windsor EV Booking : MG విండ్సర్ EVని బుకింగ్ ప్రారంభం.. ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్లు
    MG విండ్సర్ EVని బుకింగ్ ప్రారంభం

    MG Windsor EV Booking : MG విండ్సర్ EVని బుకింగ్ ప్రారంభం.. ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకుంటే, ఈ వార్త మీ కోసం! టాటా మోటార్స్ తరువాత, దేశంలో రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ కారు విక్రయదారు అయిన ఎంజీ మోటార్స్, ఎంజీ విండ్సర్ ఈవీ కోసం బుకింగ్ ప్రారంభించింది.

    కంపెనీ అక్టోబర్ 3వ తేదీ ఉదయం 7:30 గంటలకు ఈ వాహనానికి బుకింగ్‌లను ప్రారంభించింది.

    అక్టోబర్ 3 నుండి, కస్టమర్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా షోరూమ్‌లలో ₹11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి విండ్సర్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.

    ఈ కారు డెలివరీలు అక్టోబర్ 12 నుండి ప్రారంభం అవుతాయి. ఎంజీ విండ్సర్ ఈవీని బుక్ చేసుకోవడానికి కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా బ్రాండ్, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

    వివరాలు 

    ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌

    ఎంజీ విండ్సర్ ఈవీ ఫీచర్లు, పవర్ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

    పవర్ట్రెయిన్ విషయానికి వస్తే, ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 136 బిహెచ్పీ శక్తిని, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఎంజీ విండ్సర్ ఈవీ 4 డ్రైవింగ్ మోడ్స్ (ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్)లో అందుబాటులో ఉంది.

    నివేదికల ప్రకారం, ఈ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

    భారత మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹9.99 లక్షలు, సాధారణ ఎక్స్-షోరూమ్ ధర ₹13.50 లక్షలుగా ఉంది.

    వివరాలు 

    మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్

    అదే విధంగా,ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, వైర్లెస్ ఫోన్ మిర్రరింగ్, 360 డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ కారు టెక్నాలజీ, 8.8 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

    వివరాలు 

    లెవల్ -2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్

    ఫీచర్లలో ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్, ఇంటీరియర్ లోపల యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్ పై అమర్చిన మీడియా కంట్రోల్స్ ఉన్నాయి.

    మెరుగైన భద్రత కోసం, ఎంజీ విండ్సర్‌లో లెవల్ -2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్ అమర్చారు.

    ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్లు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆటో మొబైల్

    Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే! కార్
    AutoMobile Retail Sales : ఈసారి పండగ సీజన్లో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు.. ఏకంగా 19శాతం వృద్ధి కార్
    Audi car: 2025 ఆడీ S5 స్పోర్ట్ కారులో ఊహించని ఫీచర్లు కార్
    2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది? హ్యుందాయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025