
ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ వాహదారులకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటివరకు జీరో రోడ్ ట్యాక్స్ ఉండేది.
ఇకనుండి జీరో రోడ్ ట్యాక్స్ ఉండదని కార్ షోరూమ్ యజమానులు చెబుతున్నారు. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా రోడ్ ట్యాక్స్ ఉండబోతుందని అంటున్నారు.
ఈ విషయమై కార్ షోరూమ్ యజమానులు స్పందిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Details
కార్ల ధరలను బట్టి రోడ్ ట్యాక్స్
జూన్ నెల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ అనేది ఉందనీ, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే సమయంలో లైఫ్ ట్యాక్స్ అని చూపిస్తుందని కార్ షోరూమ్ మేనేజర్లు తెలుపుతున్నారు.
రోడ్ ట్యాక్స్ ని లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు. లైఫ్ ట్యాక్స్ అనేది కార్ల ధరను బట్టి ఉంటుందని సమాచారం.
10లక్షల కంటే తక్కువ ఎక్స్ షోరూమ్ ధర ఉన్న కారుకు 11శాతం రొడ్ ట్యాక్స్ ఉంటుందనీ, 10-20లక్షల లోపు ధరలున్న కార్లకు 14శాతం, 20లక్షల కంటే ఎక్కువ ధరలున్న కార్లకు 15శాతం లైఫ్ ట్యాక్స్ విధించనున్నారట.