Page Loader
Mark Zuckerberg: 1 బిలియన్ డాలర్ ఆఫర్.. ఎఫ్‌టీసీ తిరస్కరణ, ట్రయల్ ముంచుకొస్తుందా?
1 బిలియన్ డాలర్ ఆఫర్.. ఎఫ్‌టీసీ తిరస్కరణ, ట్రయల్ ముంచుకొస్తుందా?

Mark Zuckerberg: 1 బిలియన్ డాలర్ ఆఫర్.. ఎఫ్‌టీసీ తిరస్కరణ, ట్రయల్ ముంచుకొస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సంస్థను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్‌లో నిలిపింది. మార్కెట్‌లో గుత్తాధిపత్యం కోసం తాము తీసుకున్న వ్యూహాలు అన్యాయమని, వాటి కారణంగా పోటీని అణిచివేశారని FTC ఆరోపించింది. ఈవిచారణలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభమయ్యే ముందు సెటిల్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు జరిగినట్టు అమెరికన్ మీడియాలో కథనాలు వెలుగుచూశాయి. జుకర్‌బర్గ్‌ వ్యక్తిగతంగా FTC ఛైర్మన్ ఆండ్రూ ఫెర్గూసన్‌ను సంప్రదించారని సమాచారం. తొలుత 450 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌ను ప్రతిపాదించగా, ట్రయల్ సమీపిస్తున్న వేళ ఆ మొత్తాన్ని 1 బిలియన్ డాలర్లకు పెంచారని తెలుస్తోంది. కానీ FTC పెద్ద మొత్తాన్ని, కనీసం 18 బిలియన్ డాలర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

Details

పిచ్చి యత్నంగా అభివర్ణించిన జుకర్ బర్గ్

వాస్తవానికి FTC 30 బిలియన్ డాలర్ల పరిధిలో సెటిల్‌మెంట్ ఆశిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ ప్రయత్నాన్ని 'పిచ్చి యత్నం'గా అభివర్ణించారు. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ వంటి పోటీదారులను కొనుగోలు చేయడం ద్వారా మెటా సంస్థ తామే ప్రధాన మాధ్యమ సంస్థగా మిగిలేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. దీనికి బలంగా సంస్థ అంతర్గత ఈమెయిళ్లను ప్రస్తావించింది. వాటిలో 'పోటీ చేయడం కన్నా కొనడం మంచిదని జుకర్‌బర్గ్ పేర్కొన్న మెసేజ్ ఒకటి కూడా ఉందని FTC వెల్లడించింది.

Details

విడగొట్టడం తేలికమైన విషయం కాదు

మెటా సంస్థ మాత్రం తమ పెట్టుబడుల వల్లే ఈ యాప్‌లు ఈ స్థాయిలో ప్రజాదరణ పొందాయని, లేకపోతే అవి అంతగా ఎదగేవి కాదని కోర్టులో వాదించింది. అయితే విచారణలో కోర్టు తీర్పు మెటాకు వ్యతిరేకంగా వస్తే, సంస్థ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను విడగొట్టాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు యాప్‌లు మెటా ఆదాయంలో సగానికి పైగా వేరుగా నిలుస్తుండటంతో, విడగొట్టడం తేలిక విషయం కాదని కూడా పేర్కొన్నారు. 2021లో ట్రంప్ అనుచరులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి చేసిన అనంతరం, ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు (ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) నిషేధించిన విషయం తెలిసిందే.

Details

వ్యాపార అభివృద్ధే లక్ష్యంగా మెటా

అయితే 2023లో వాటిని తిరిగి యాక్టివేట్ చేశారు. ఆ సమయంలో ట్రంప్ మెటాపై దావా వేయగా, ఇటీవల అది సెటిల్ అయింది. ఇదే నేపథ్యంతో యాంటీ ట్రస్ట్ ట్రయల్ విషయమై ట్రంప్ నుంచి మద్దతు వస్తుందని జుకర్‌బర్గ్ ఆశించారని సమాచారం. అతని జోక్యం కోరినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ట్రయల్ ఫలితం మెటా భవితవ్యాన్ని నిర్ణయించనుంది. FTC అగ్రస్థాయిలో పోటీ సరైన దారిలో సాగాలన్న దానిపై దృష్టి సారించగా, మెటా మాత్రం వ్యాపార అభివృద్ధే లక్ష్యంగా వ్యవహరించిందని వాదిస్తోంది.