Loading...
SBI hiring: ఎస్‌బీఐలో 12 వేల ఉద్యోగాలు.. ఈ ఏడాదే భారీ నియామకాలు!
ఎస్‌బీఐలో 12 వేల ఉద్యోగాలు.. ఈ ఏడాదే భారీ నియామకాలు!

SBI hiring: ఎస్‌బీఐలో 12 వేల ఉద్యోగాలు.. ఈ ఏడాదే భారీ నియామకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల కొత్త నియామకాలు చేపట్టడంతో పాటు.. దేశవ్యాప్తంగా మరో 250 వరకు కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. ఈ ఏడాది 11 వేల నుంచి 12 వేల వరకు కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలు ఉన్నాయని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ముఖ్యంగా క్లరికల్‌, ఆఫీసర్‌ కేడర్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్లు, బ్యాంకు భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

వివరాలు

2.45 లక్షలు దాటిన ఉద్యోగుల సంఖ్య

ఎస్‌బీఐకి దేశంలోనే అత్యంత భారీ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ ఉందని సీఎస్ శెట్టి పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు కొత్తగా 200 నుంచి 250 బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

మార్చి 2026 నాటికి ఎస్‌బీఐలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఏకంగా 25,633 మందిని నియమించుకుంది.

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదిస్తున్న రూ.30 వేల కోట్ల ఐపీఓలోనూ ఎస్‌బీఐ కీలకంగా వ్యవహరించనుంది.

ఈ ఐపీఓలో ఎస్‌బీఐతో పాటు దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సంయుక్తంగా 1 శాతం వాటాను విక్రయించనున్నాయి

ADVERTISEMENT