Page Loader
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ శనివారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో నికర లాభం రూ.11,792 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.10,272 కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల అని బ్యాంక్‌ వెల్లడించింది. ఆదాయం కూడా రూ.42,792 కోట్ల నుంచి రూ.48,368 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. ఈ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.36,695 కోట్ల నుంచి రూ.41,300 కోట్లకు పెరిగింది.

Details

నికర ఆస్తులు తగ్గుదల

స్థూల నిరర్థక ఆస్తులు 1.96 శాతానికి తగ్గాయని, గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం 2.3 శాతంగా ఉన్నట్లు బ్యాంక్‌ తెలియజేసింది. నికర నిరర్థక ఆస్తులు 0.44 శాతం నుంచి 0.42 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఈ ఫలితాలతో ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ ఆర్థిక ప్రగతిని కొనసాగిస్తూ, నష్టాల నియంత్రణలో మెరుగైన ఫలితాలను సాధించిందని స్పష్టమవుతోంది.