Harsh Goenka: 9-5 జాబ్ జీవితం మీద హర్ష్ గొయెంకా స్పందన.. వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ నెటిజన్లను ఆలోచనలో పడేస్తుంటారు. తాజాగా ఆయన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జీవితాంతం పనిచేస్తే కలిగే నష్టం గురించి ప్రస్తావిస్తూ ఓ వ్యంగ్యాత్మక వీడియోను ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Details
వీడియో కథనం ఇదే
వీడియోలో ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన యువకుడికి ఒక వ్యక్తి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తాడు. ఆ పని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నాలుగు గోడల మధ్య నిల్చోవడం. విద్యార్థి వెంటనే ఆఫర్ అంగీకరిస్తాడు. కాలక్రమంలో వయసు పెరిగినా, జీతం పెరిగినా, పని మాత్రం మారదు. ఏ మార్పూ లేకుండా ఉద్యోగ జీవితం కొనసాగుతుంది. చివరికి పదవీ విరమణ తర్వాత కూడా అతను అదే జీవితం గడిపినట్టు చూపించారు. వీడియో చివర్లో "9-5 పని చర్య మీ జీవితాన్ని నెమ్మదిగా సాగుతుంది. ఆలస్యం కాకముందే మార్పు తీసుకురండి అనే సందేశం నిక్షిప్తమవుతుంది. జీవన విధానంలో మార్పు అవసరమన్నదే హర్ష్ గొయెంకా సందేశం.
Details
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్ల నుండి విభిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది గొయెంకా అభిప్రాయానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. "9-5 ఉద్యోగం ఒక ఎర.. ఎంత ప్రతిభ ఉన్నా పదవీ విరమణ తర్వాత మీ స్థానంలో ఇంకొకరే వస్తారు. జీవితం ఆస్వాదించండి అంటూ ఒకరు కామెంట్ చేశారు. అయితే మరికొందరు వ్యతిరేకత కూడా వ్యక్తంచేశారు. సర్‌జీ, ఈ వీడియోను మీ ఉద్యోగులకు చూపించకండి. వాళ్లు ఫాలో అయితే మీ బిజినెస్‌కే నష్టమంటూ చమత్కారంగా స్పందించారు.