Loading...
5 Days Banking: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాలపై ఐబీఏ గ్రీన్ సిగ్నల్!
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాలపై ఐబీఏ గ్రీన్ సిగ్నల్!

5 Days Banking: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాలపై ఐబీఏ గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించినప్పటికీ ఖాతాదారులకు అందించే బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కమిటీ అభిప్రాయపడింది. 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో ఎలాంటి జాప్యం చేయకూడదని యూనియన్లు స్పష్టం చేశాయి. ఈ అంశంపై చర్చలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి.

వివరాలు 

సెప్టెంబర్ 27న విధులు నిర్వహించిన వారికి ప్రత్యేక వేతనం

వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమలుపై ఐబీఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి.

2026 సెప్టెంబర్ 27న ఆదివారం విధులు నిర్వహించిన ప్రైవేట్ బ్యాంకు అధికారులకు ఊరట కల్పించే నిర్ణయానికి ఐబీఏ అంగీకరించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు ఇచ్చిన తరహాలోనే ప్రైవేట్ బ్యాంకు అధికారులకు కూడా ఒక రోజు ప్రత్యేక వేతనం చెల్లించేందుకు సమ్మతించింది.

అంతేకాకుండా, ఆరోజు వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరుకాని ఉద్యోగుల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంది.

అలాంటి సిబ్బంది నుంచి సెలవు దరఖాస్తులు సమర్పించాలని కోరవద్దని బ్యాంకు యాజమాన్యాలకు సూచించనుంది.

దీంతో ఆ రోజు విధులకు హాజరుకాలేకపోయిన ఉద్యోగులకు కూడా ఊరట లభించనుంది.

వివరాలు 

వేతన సవరణ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై చర్చలు

ప్రస్తుత వేతన ఒప్పందం 2027 అక్టోబర్‌లో ముగియనుంది.

ఈ నేపథ్యంలో తదుపరి వేతన సవరణ ప్రక్రియను ముందుగానే వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది.

అయితే కొత్త డిమాండ్లపై చర్చించే ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు కోరాయి.

ముఖ్యంగా పీఎల్‌ఐ (PLI) నిబంధనల్లో మార్పులు, ప్రైవేట్ బ్యాంకుల పెన్షనర్లకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించిన అంశాలను ముందుగా పరిష్కరించాలని యూనియన్లు విజ్ఞప్తి చేశాయి.

ఈ డిమాండ్లపై ఐబీఏ సానుకూలంగా స్పందించింది. దీంతో బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణతో పాటు పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై కూడా ఆశలు చిగురించాయి.

ADVERTISEMENT