8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వనుంది. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీని ఫలితంగా ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి. వచ్చే నెలలోనే ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 నెలల క్రితమే ఈ కమిషన్‌ను ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు అది ఏర్పడలేదు. ఈ ఆలస్యం నేపథ్యంలో కేంద్ర ఉద్యోగుల సంఘాలు 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, నోటిఫికేషన్ త్వరగా జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివరాలు
పెన్షనర్లు కొత్త వేతన సంఘం అమలుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నకేంద్ర ఉద్యోగులు
మరోవైపు, ప్రభుత్వం కూడా దీనిపై చురుకుగా చర్యలు తీసుకుంటోందని సమాచారం. వచ్చే నెలలో కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ వెలువడే అవకాశం బలంగా కనిపిస్తోంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సంఘం అమలుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే 7వ వేతన సంఘం ఆధారంగా డీఏ (Dearness Allowance), డీఆర్ (Dearness Relief)లను 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో డీఏ 55% నుంచి 58%కు చేరింది. 8వ వేతన సంఘం అమలయ్యాక జీతాలు, పెన్షన్లు, అలవెన్సుల్లో మరిన్ని మార్పులు రావచ్చు.
వివరాలు
2027 నాటికి కొత్త వేతన కమిషన్ అమలు
7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పడి, 2015 నవంబరులో తన రిపోర్టును సమర్పించింది. అదే తరహాలో, ఈ నెలలో 8వ వేతన సంఘం ప్రకటించినా, దాని నివేదిక ఏప్రిల్ 2027కు ముందే రావడం కష్టమని అధికారులు అంచనా వేస్తున్నారు. జూలై 2027 నాటికి కొత్త వేతన సంఘం అమలులోకి వస్తుందనే ఆశాభావాన్ని సీనియర్ యూనియన్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కమిషన్ తన నివేదిక సిద్ధం చేయడానికి కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం పదవీకాలం 2025 డిసెంబర్‌లో ముగుస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, కొత్త వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి.
వివరాలు
రక్షణ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ప్రయోజనం
కమిషన్ సిఫార్సులు జూలై 2027లో విడుదలైతే,ఉద్యోగులకు జనవరి 2026 నుంచి జూలై 2027 వరకు బకాయిలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల సుమారు 18నెలల బకాయిల రూపంలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లాభం పొందగలరు. 8వ వేతన సంఘం ద్వారా సుమారు 5మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,6.5మిలియన్ల పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ వేతన సంఘం పరిధిలో రక్షణ సిబ్బంది,రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉంటారు. కమిషన్ ఏర్పాటు ఆలస్యంపై ఇటీవల సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. 7వ వేతన సంఘం అమలు తేదీకి దాదాపు రెండేళ్ల ముందు ఏర్పాటు చేయబడిందని,ఆ విధంగా 8వ కమిషన్‌కి కూడా తగిన సమయం ఇవ్వాలని ఫోరం ప్రధానికి లేఖ రాసింది.
వివరాలు
ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములా ప్రవేశపెట్టే అవకాశం
దీని వలన కమిషన్ సమగ్రమైన విశ్లేషణ చేసి మెరుగైన సిఫార్సులు ఇవ్వగలదని వారు పేర్కొన్నారు. ఈ అంచనా ప్రకారం, నవంబర్ నాటికి కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ రాకపోతే, సిఫార్సులు 2027 నవంబర్ వరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దానితోపాటు, అమలుకు 2028 జనవరి వరకు వేచి చూడవలసి రావచ్చు. అయితే ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ విధానంలో, సిఫార్సులు ఏడాది లోపే పూర్తవుతాయని వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే, 2027 ప్రారంభం నుంచే 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే అవకాశం ఉంటుంది.