8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది.
కొన్ని రోజులుగా దీనిపై ఊహాగానాలు నడుస్తుండగా, తాజాగా ఈ వేతన సంఘంపై ప్రభుత్వం అధికారిక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి 8వ వేతన సంఘం ప్రక్రియ ప్రారంభం కానుంది.
8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి?
7వ వేతన సంఘం 2014లో ఏర్పడగా, 2016లో ఆ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇక 8వ వేతన సంఘం 2025 ఏప్రిల్‌లో అధికారికంగా ఏర్పాటు చేయనుంది.
కానీ కమిషన్ నివేదిక సిద్ధమై 2026 జనవరి 1 నుంచి వేతన సంఘం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Details
జీతం, పెన్షన్ ఎంత పెరగొచ్చు?
8వ వేతన సంఘం అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వేతన పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు
కానీ కొన్ని అంచనాల ప్రకారం 100% నుంచి 186% వరకు వేతనాలు పెరగొచ్చు. మరికొందరు 20% నుంచి 30% వరకు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం
కనీస ప్రాథమిక జీతం - రూ. 18,000
కనీస ప్రాథమిక పెన్షన్ - రూ. 9,000
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై అంచనాలు
8వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుండి 2.86 వరకు ఉండొచ్చు.
Details
ప్రభుత్వ నిర్ణయం ఏది?
భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకారం, ప్రభుత్వం 1.92 లేదా 2.08 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదించే అవకాశం ఉంది.
కానీ NC-JCM సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ 2.86 కన్నా తక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అంగీకరించరాదని స్పష్టం చేశారు.
8వ వేతన సంఘం టైమ్‌లైన్
2025 ఫిబ్రవరి 15: 8వ వేతన సంఘం ఏర్పాటు
2025 ఏప్రిల్: కమిషన్ అధికారికంగా ప్రక్రియ ప్రారంభం
2025 నవంబర్ 30: తుది నివేదిక సిద్ధం
2025 డిసెంబర్: ప్రభుత్వ సమీక్ష
2026 జనవరి 1: కొత్త వేతన సంఘం అమలు
Details
ఎంత మంది ఉద్యోగులకు లాభం?
50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
65 లక్షల మంది పెన్షనర్లు
ఈ మార్పులు అమలైన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు రానున్నాయి.
వేతన పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.