LOADING...
8th Pay Commission: ఉద్యోగులకు ఏటువంటి మార్పులు ఉంటాయి? అమలు ఆలస్యానికి కారణాలేమిటి?
ఉద్యోగులకు ఏటువంటి మార్పులు ఉంటాయి? అమలు ఆలస్యానికి కారణాలేమిటి?

8th Pay Commission: ఉద్యోగులకు ఏటువంటి మార్పులు ఉంటాయి? అమలు ఆలస్యానికి కారణాలేమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల తీసుకొచ్చే అవకాశం ఉన్న 8వ వేతన సంఘం పై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీని అమలుపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. NDTV రిపోర్ట్ ప్రకారం, కనిష్ట బేసిక్ జీతం ప్రస్తుతం ఉన్న ₹18,000 నుంచి ₹51,480కు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. అదనంగా, ప్రస్తుతం అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) స్థానంలో కొత్త ఆరోగ్య బీమా పథకం రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వైద్య సదుపాయాలు మరింత మెరుగ్గా లభించనున్నాయి.

వివరాలు 

వేతన సంఘం అధికారికంగా ఏర్పాటు కాలేదు

అయితే, ఈ ప్రక్రియలో ఇప్పటికే ఆలస్యాలు స్పష్టమవుతున్నాయి. లైవ్‌మింట్ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు వేతన సంఘం అధికారికంగా ఏర్పాటు కాలేదు. చైర్మన్,సభ్యుల నియామకాలు జరగలేదు.అలాగే Terms of Reference (ToR) తుది నిర్ణయం కూడా పెండింగ్‌లోనే ఉంది. ఆర్థిక,పరిపాలనా సవాళ్లు కారణంగా ప్రక్రియ నెమ్మదించిందని చెబుతున్నారు. కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం,8వ వేతన సంఘం 2026 చివర్లో లేదా 2027 ఆరంభంలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గత వేతన సంఘాలు ఏర్పాటైన తర్వాత నివేదిక ఇవ్వడానికి సగటున 1.5 సంవత్సరాలు పట్టాయని, కేబినెట్ ఆమోదం తర్వాత అమలుకు మరో 3-9 నెలలు పట్టిందని నివేదికలో పేర్కొంది.

వివరాలు 

జీతాలు,పెన్షన్లు 30-34% వరకు పెరిగే అవకాశం

అలాగే, కనిష్ట జీతం సుమారు ₹30,000 వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ఇది సుమారు 13% వాస్తవ వేతన పెరుగుదలకు దారితీస్తుందని చెబుతోంది. అంబిట్ క్యాపిటల్ రిపోర్ట్ ప్రకారం,జీతాలు,పెన్షన్లు 30-34% వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో సుమారు 44 లక్షల ఉద్యోగులు,68 లక్షల పెన్షనర్లు నేరుగా లాభపడతారని అంచనా. 2016లో అమలైన 7వ వేతన సంఘం సగటున 14% పెరుగుదల ఇచ్చింది. దానికి బదులుగా 8వ వేతన సంఘం అమలు కానుంది. అంబిట్ నివేదికలో,జీతం లెక్కించడంలో కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. తుది నిర్ణయం బేసిక్ పే,డీఏ(DA),హౌస్ రెంట్ అలవెన్స్ (HRA),ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA)వంటి అన్ని జీత భాగాలపై ప్రభావం చూపనుంది.

వివరాలు 

8వ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద మేలు

అయితే ఇంకా వేతన సంఘం ఏర్పడకపోవడంతో, దీని అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యమైతే, ఆ సమయంలో పెరిగే జీతాలు, పెన్షన్లు బకాయిలుగా చేరి, తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తుంది. మొత్తం మీద, 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద మేలు చేస్తుందని నిపుణులు అంగీకరిస్తున్నారు. కానీ, అన్ని పరిపాలనా ప్రక్రియలు పూర్తవడం, బడ్జెట్ ఆమోదం, తుది సిఫారసులు నిర్ణయించబడటం కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.